పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన సక్సెస్ ఫుల్ గా ముగిసింది. పుతిన్ ఇప్పటికి వరకు 10 సార్లు ఇండియాను సందర్శించగా, ఇది ఆయన 11వ పర్యటన. భారత్ వచ్చిన పుతిన్‌కు ప్రధాని మోదీ ప్రోటోకాల్ ను పక్కన పెట్టి మరీ స్వాగతం పలికటం, ఒకే కారులో ప్రయాణించడం వంటి ఆసక్తికర ఘటనలు జరిగాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన గౌరవార్థం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందు మెనూ ప్రస్తుతం వైరల్ గా మారింది. రష్యా అధ్యక్షుడికి ఏవేమి వడ్డించారనే ఆసక్తి పెరిగింది.
అతిథిగా వచ్చిన పుతిన్‌కు ఈ విందులో పూర్తిగా శాకాహారం వడ్డించారు. దేశంలోని నలుమూలల నుంచి ఎంపిక చేసిన వంటకాలకు స్థానం కల్పించారు. కూరగాయలతో చేసిన’జోల్ మోమో’తో స్టార్టర్స్ ప్రారంభించారు. ప్రధాన వంటకాల్లో ‘జాఫ్రానీ పనీర్ రోల్’, ‘పాలక్ కోఫ్తా’, తందూరీ భర్వాన్ ఆలూ, డ్రై-ఫ్రూట్ కుంకుమపువ్వు పులావ్, మిస్సి రోటీ వడ్డించారు. స్వీట్ల విషయానికొస్తే ‘బాదం హల్వా’తో పాటు ‘సీతాఫల్ క్రీమ్’ అందించారు. తనకు వడ్డించిన వాటిలో గోంగూర పచ్చడి, ఆవకాయ వంటివి పుతిన్‌కు బాగా నచ్చాయట. పుతిన్ మాట్లాడుతూ.. భారత్ ఇచ్చిన అపూర్వ ఆతిథ్యానికి థ్యాంక్స్ చెప్పారు. విందులో ప్రధాని మోదీ, ఎస్. జైశంకర్ సహా కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. అయితే ప్రధాని బహూకరించిన ఆరు కానుకలు హాట్ టాపిక్ గా మారాయి. మార్బుల్ చెస్, కశ్మీరీ కుంకుమపువ్వు, భగవద్గీత , సిల్వర్ టీ-సెట్, వెండి గుర్రం ఈ బహుమతులన్నీ భారత కళల గొప్పతనాన్ని రష్యా అధ్యక్షుడికి పరిచయం చేశాయి.
మరిన్ని వీడియోల కోసం :
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియో
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్‌పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో