మనిషైనా..జంతువైనా.. ఆ విషయం లో భార్యకు వణకాల్సిందే

Updated on: Jul 19, 2025 | 5:53 PM

భర్త పొగడ్త ఏదైనా సరే.. అది పూర్తిగా తనకే చెందాలి. అలా కాదని పొరపాటున వేరే ఎవరినైనా పొగిడినా, వాళ్లను మెచ్చుకున్నా అతనికి తన భార్య చేతిలో మామూలుగా ఉండదు.. అలాంటి పరిస్థితే ఓ గొరిల్లాకు ఎదురైంది. ఈ ఘటన చూసి నెటిజన్లు మనిషైనా..జంతువైనా భార్యకు భయపడాల్సిందేనని అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

జూకి వెళ్లిన ఓ యువతి గొరిల్లాల ఎన్‌క్లోజర్ వద్ద నిల్చుని వాటిని చూస్తోంది. ఇంతలో ఓ మగ గొరిల్లా మహిళకు దగ్గరగా వచ్చి ఆ యువతి జుట్టును పట్టుకుని అబ్బా నీ హెయిర్‌ ఎంత బావుందో అన్నట్టుగా ముద్దు చేసింది. దూరాన్నుంచి ఇది గమనించిన ఆడ గొరిల్లా వెంటనే అక్కడికి దూసుకొచ్చింది. ఇక్కడ నేనుండగానే ఆ అమ్మాయిని టచ్ చేస్తావా..ఉండు నీపని చెప్తా అన్నట్టుగా.. మగ గొరిల్లాపై దాడి చేసింది. దానిని వెనక్కి లాగిపడేసింది. అంతటితో ఆగకుండా, మగ గొరిల్లాను పొట్టు పొట్టుగా కొట్టింది. ఈ అనూహ్య ఘటనను అక్కడున్న పర్యాటకులు తమ సెల్‌ఫోన్లలో వీడియో తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు. ఆడ గొరిల్లా ప్రవర్తనపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “ఆడ గొరిల్లా నిజమైన భార్య అనిపించుకుందని ఒకరు, తప్పుచేసిన భర్తకు మహబాగా బుద్ధి చెప్పిందని మరొకరు సరదాగా కామెంట్లు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గూగుల్ సెర్చ్‌లో సరికొత్త మోడ్.. ఇకపై మరింత ఈజీ

ఇదేంటి భయ్యా.. మందు తాగకుండానే పాజిటివ్‌

ఫోన్‌‌ చూసీ.. చూసీ.. యువకుడికి సరికొత్త వ్యాధి.. ఆ సామర్థ్యాన్ని కోల్పోయిన బాధితుడు

ప్రభాస్‌ సినిమాకు OTT దెబ్బ..! రిలీజ్‌ కష్టమేనా?

స్పిరిట్ సినిమాపై అతి తెలివిగా మాట్లాడిన త్రిప్తి