బియ్యం ధర గిన్నీస్ వరల్డ్ రికార్డ్.. తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే
జపాన్ కిన్మెమై రైస్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది, దీని ధర కిలోకు రూ.15,000. టోయో రైస్ కార్పొరేషన్ పండించే ఈ ప్రీమియం బియ్యంలో సాధారణ బియ్యం కంటే అధిక ఫైబర్, విటమిన్ బి1 ఉంటాయి. కడగాల్సిన అవసరం లేని ఈ బియ్యం రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. దీని ప్రత్యేక ప్రాసెసింగ్, ఆరోగ్య ప్రయోజనాల వల్ల గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకుంది.
మనం రోజూ ఆహారంగా తిసుకునే బియ్యం ధర ఎంత ఉంటుంది అంటే రకాన్ని బట్టి ఓ 50 రూపాయల నుంచి 200 వందలు ఉంటుందని చెబుతారు. కానీ, ఆ బియ్యం తినాలంటే మాత్రం ఆస్తులు అమ్ముకున్నా క్వింటాలు బియ్యం కొనలేము. జపాన్‌లో పండే ఈ బియ్యం ధర కిలోకు ఏకంగా 15వేల రూపాయలు. జపనీస్ కిన్మెమై రైస్ అని పిలిచే ఈ బియ్యాన్ని జపాన్‌లో పండిస్తారు. అత్యంత ఖరీదైన బియ్యంగా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. జపాన్‌లోని టోయో రైస్ కార్పొరేషన్ 5 స్పెషల్ వరి వంగడాలను పండిస్తుంది. వాటిలో ఒకటే కిన్మెమై రైస్. దీన్నే ప్రీమియం రైస్ అని కూడా అంటారు. ఈ సంస్థను 1961లో స్థాపించారు. కిన్మెమై బియ్యం బ్రైన్ రైస్ కంటే చాలా తేలికగా ఉంటాయి. కిన్మెమై గింజలు చాలా చిన్నగా ఉంటాయి. ఈ బియ్యం ప్రత్యేకత ఏంటంటే వీటిని వండే ముందు కడగాల్సిన పని లేదు.. చాలా తక్కువ సమయంలోనే ఉడికించుకోవచ్చు. మిగిలిన బియ్యం రకాలతో పోల్చిస్తే కిన్మెమై రకం బియ్యంలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. రుచి ఆద్భుతంగా.. స్వీట్‌గా ఉంటుంది. తిన్న వెంటనే సులువుగా జీర్ణమవ్వటమే కాదు.. ఎక్కువ శక్తిని అందిస్తుంది. ఇవి తెలుపు, గోధుమ రంగులో అందుబాటులో ఉన్నాయి. సాధారణ బియ్యంతో పోలిస్తే వీటిలో 1.8 రెట్లు ఫైబర్, 7 రెట్లు విటమిన్ బి1 అధికంగా ఉంటుంది. ఇందులో ఆరు రెట్లు లిపోపాలిసాకరైడ్‌లను కలిగి ఉంది. ఈ రైస్ శరీరంలో సహజ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఫ్లూ, ఇన్ఫెక్షన్, కేన్సర్ వ్యాధులతో పోరాడేలా ఇమ్యూనిటీని పెంచి.. అనారోగ్యాన్ని దరిచేరనివ్వకుండా చేయడమే దీని ప్రత్యేకత. ఈ బియ్యాన్ని ప్రత్యేకమైన ప్రాసెసింగ్ విధానాల్లో పండిస్తారు. ఇక ఈ బియ్యం పండించడానికి కావాల్సిన టెక్నాలజీపై జపాన్ పేటెంట్ కూడా తీసుకుంది.మార్కెట్‌లో ఈ బియ్యం ధరలు రకాన్ని బట్టి ఉంటాయి. కనీసం కిలోకు 109 డాలర్ల నుంచి 155 డాలర్ల వరకు ఉంటాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆధార్ వినియోగదారులకు మరో గుడ్ న్యూస్
ఇకపై విమానాలకు ఇంధనంగా వంటనూనె !!
వేల కోట్ల వ్యాపారాలకు వారసుడు.. అయినా రాత్రిళ్లు క్యాబ్ నడుపుతూ
