బీచ్‌లో కొట్టుకొచ్చిన వింత బంతి.. భయం భయంగా.. దగ్గరకు వెళ్లి చూడగా

|

Mar 09, 2023 | 9:36 PM

జపాన్‌లోని ఒక బీచ్‌లో ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. అక్కడ సముద్ర తీరంలో ఒక పెద్ద మెటల్ బాల్ ప్రత్యక్షమైంది. అవును, ఆ బీచ్‌లో ఒక భారీ మెటల్ గోళాకారపు బంతి పడి ఉంది,

జపాన్‌లోని ఒక బీచ్‌లో ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. అక్కడ సముద్ర తీరంలో ఒక పెద్ద మెటల్ బాల్ ప్రత్యక్షమైంది. అవును, ఆ బీచ్‌లో ఒక భారీ మెటల్ గోళాకారపు బంతి పడి ఉంది, ఆ బీచ్ ..ఫేమస్‌ టూరిస్ట్ ప్లేస్ కావడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే ఈ వింత బంతిని చూసి వారంతా భయంతో అక్కడినుంచి వెళ్లిపోయారు. అనంతరం పోలీసులు, అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారితో కలిసి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ విచారణ ప్రారంభించింది. జ‌పాన్‌లోని హ‌మ‌మ‌ట్సు నగరంలోని ఎన్‌షు బీచ్‌లో జరిగింది ఈ ఘటన. మొట్టమొదట ఈ బంతిని ఒక మహిళ చూసింది. ఆమె వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. దానికి చుట్టు పక్కల 200 మీటర్ల వరకు ప్రజల్ని అనుమతించకుండా నిషేధం విధించారు. ఇక ఆ వింత ఆకారాన్ని చూసిన చాలా మంది ప్రజలు అది గ్రహాంతరవాసులకు సంబంధించిన షెల్స్‌గా చెప్పుకోవటం మొదలు పెట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లి ఊరేగింపులో కోట్ల విలువైన కార్లు.. అయినా వాటిని వదిలి వింతగా ఎంట్రీతో షాక్ ఇచ్చిన వరుడు

Published on: Mar 09, 2023 09:36 PM