R-Rated Movie: విమానం ఎక్కి కూర్చున్నాక బూతు సినిమా పెట్టి చూపించారు.! వీడియో వైరల్..
బస్సులు, విమానాల్లో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బోర్గా ఫీల్ కాకుండా సినిమాలు, పాటలు ప్లే చేయడం చూస్తాం. విమానంలో ప్రతి ప్రయాణికుడికి ప్రత్యేకంగా ఎల్ఈడీ స్క్రీన్లు ఉంటాయి. మనకు అవసరం లేదనుకుంటే ఆఫ్ చేసే వెసులుబాటు ఉంటుంది. కానీ, ఆస్ట్రేలియా నుంచి జపాన్కు బయలుదేరిన విమానంలో మాత్రం ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది.
బస్సులు, విమానాల్లో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బోర్గా ఫీల్ కాకుండా సినిమాలు, పాటలు ప్లే చేయడం చూస్తాం. విమానంలో ప్రతి ప్రయాణికుడికి ప్రత్యేకంగా ఎల్ఈడీ స్క్రీన్లు ఉంటాయి. మనకు అవసరం లేదనుకుంటే ఆఫ్ చేసే వెసులుబాటు ఉంటుంది. కానీ, ఆస్ట్రేలియా నుంచి జపాన్కు బయలుదేరిన విమానంలో మాత్రం ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. క్వాంటాస్ ఎయిర్లైన్స్ విమానంలో ఎంటర్టైన్మెంట్ సిస్టమ్లో తలెత్తిన సాంకేతిక సమస్యతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ‘పెద్దలు మాత్రమే’ చూడాల్సిన చిత్రం కావడమే దీనికి కారణం. చిన్నారులతో వెళ్తోన్న మహిళలు స్క్రీన్ను ఆఫ్ చేసే అవకాశం లేకపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అసలేం జరిగిందంటే…?
క్వాంటాస్ ఎయిర్లైన్స్కు చెందిన ఫ్లైట్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి జపాన్లోని హనెడాకు బయల్దేరింది. ప్రయాణికుల్లో మహిళలు, చిన్నారులు చాలా మందే ఉన్నారు. వారందరి కోసం ఎయిర్లైన్స్ సిబ్బంది ఓ చిత్రాన్ని ప్రదర్శించారు. అది ‘అడల్ట్ కంటెంట్’ కావడంతో ప్రయాణికుల్లో కొందరు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. బ్రాడ్కాస్ట్ తమకు అవసరం లేదని ఆపేద్దామని ప్రయత్నించినా కుదరలేదు. దీనికి సాంకేతిక సమస్యే కారణమని గుర్తించిన ఎయిర్లైన్స్ సిబ్బంది కొంతసేపటి తర్వాత దాన్ని నిలిపివేశారు.
ఇలాంటి అనుభవంతో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నట్లు పలువురు ప్రయాణికులు విమాన సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. ఎవరైతే వద్దని కోరారో అక్కడి స్క్రీన్లలో చిత్రం రాకుండా చేసేందుకు సిబ్బంది ప్రయత్నించినా అది ఫలించలేదు. చివరకు ఎలాగోలా ఆ చిత్రాన్ని నిలిపివేసి దానికి బదులు పిల్లలకు ఇష్టమైన మరో సినిమాను ప్రదర్శించినట్లు ఎయిర్లైన్స్ వెల్లడించింది. ఈ అసౌకర్యానికి క్షమించాలంటూ క్వాంటాస్ ఓ ప్రకటనలో పేర్కొంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.