రైల్వే స్టేషన్లో ఏదైనా కొంటున్నారా ?? ఇలా కాలర్‌ పట్టుకుంటారు జాగ్రత్త

Updated on: Oct 22, 2025 | 6:13 PM

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో సమోసా వ్యాపారికి, రైల్వే ప్రయాణికుడికి మధ్య జరిగిన ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జబల్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో ఓ ట్రైన్‌ ఆగింది. అప్పటికే ఆకలితో ఉన్న ఓ ప్రయాణికుడు వెంటనే ట్రైన్‌ దిగి సమోసాలు తీసుకుని.. యూపీఐ పేమెంట్‌ చేసే ప్రయత్నం చేశాడు. నెట్‌వర్క్‌ సమస్య వల్ల చెల్లింపు జరగలేదు.

వెంటనే తీసుకున్న సమోసాలు తిరిగి ఆ వ్యాపారికి ఇచ్చి బయల్దేరాడు ఆ యువకుడు. అయితే.. ఆ సమోసాల షాపు యజమాని ‘ నువ్వు నా టైం వేస్ట్‌ చేశావు. కాబట్టి మర్యాదగా.. ఈ సమోసాలు తీసుకుని డబ్బులు ఇచ్చి కదులు’అని హుకుం జారీ చేశాడు. అంతలోనే ట్రైన్‌ మెల్లగా కదలడం మొదలైంది. ‘సారీ.. నా దగ్గర నగదు లేదు. కాబట్టి ఆ సమోసాలు వద్దు’ అంటూ ఆ యువకుడు మర్యాదగా అక్కడి నుంచి రైలు దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశాడు. అంతే ఒక్క ఉదుటున ముందుకు దూకిన సమోసా వ్యాపారి.. ‘అవన్నీ నాకు తెలియదు. నాకు అవేమీ చెప్పకు.. ముందు డబ్బులు ఇచ్చి సమోసాలు తీసుకో’ అంటూ ప్రయాణికుడిని కాలర్‌ పట్టుకున్నాడు. కాగా, ఆ యువకుడు కాలర్‌ విడిపించుకుని ముందుకు వెళుతుంటే అడ్డు తగిలి.. అతని చేతికున్న వాచీ లాగేసుకుని.. నాలుగు సమోసాలు చేతిలో పెట్టాడు. ట్రైన్‌ ముందుకు కదులుతుంటే పాపం ఏం చేయాలో పాలుపోని ప్రయాణికుడు సమోసాలు తీసుకుని ట్రైన్‌ ఎక్కి వెళ్లిపోయాడు. ఈ ఉదంతాన్ని ఎదురుగా ఉన్న మరో ప్రయాణికుడు వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో వైరల్‌ కావడంతో జబల్‌పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ స్పందించారు. ప్రయాణికుడి పట్ల దురుసుగా ప్రవర్తించిన సమోసా వ్యాపారిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారనీ తెలిపారు. అతని లైసెన్స్ రద్దు చేసేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. కాగా, ఈ వీడియోపై నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సమోసా వ్యాపారి ప్రవర్తనను తప్పుపడుతుండగా, మరికొందరు యూపీఐ చెల్లింపులపై ఆధారపడటం ప్రమాదకరమని అభిప్రాయపడుతున్నారు. యూపీఐ వ్యవస్థలో సాంకేతిక లోపాలు,నెట్‌వర్క్ సమస్యలు వల్ల చెల్లింపులు నిలిచిపోవడం సాధారణమే అయినా, విక్రేతలు దీనిపై ఎలా స్పందించాలి అనే అంశంపై స్పష్టత అవసరం అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మోనాలిసా కొలువైన మ్యూజియంలో.. మహా దోపిడీ

మర్యాదగా ఒప్పుకో.. లేదంటే లేపేస్తాడు జెలెన్ స్కీ‌కి ట్రంప్ వార్నింగ్

ఆ చెట్టు ఆకుల్లో బంగారం.. నిర్ధారించిన ఫిన్‌ల్యాండ్ శాస్త్రవేత్తలు

నోరు మూయలేక ఇబ్బందిపడ్డ యువకుడు.. దేవుడిలా వచ్చి

Ram Pothineni: ఒక్క రాత్రిలో జీరోకు వచ్చేశాం.. కానీ ఆ తరువాత..