Loading video

Viral: తొలినాళ్లలో మనిషి ఏనుగులను తినేవాడా..? వేటకు వాడిన ఆయుధాలపై అధ్యయనం..

|

Sep 18, 2023 | 9:21 AM

మానవ పరిణామ క్రమంలో, ప్రకృతిలో మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. పెద్ద జంతువులను అంతం చేయడం ద్వారా తొలి మానవుల పరిణామ ప్రక్రియ ముందుకు సాగిందని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడయ్యింది. తొలుత మానవులు తమ పోషణ కోసం పెద్ద జంతువులపై ఆధారపడేవారు. ఈ నేపధ్యంలో అవి అంతరించిపోవడంతో చిన్న జంతువులను వేటాడేందుకు ఆయుధాలు, సాధనాలను తయారు చేయవలసి వచ్చిందని పరిశోధకులు కనుగొన్నారు.

మానవ పరిణామ క్రమంలో, ప్రకృతిలో మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. పెద్ద జంతువులను అంతం చేయడం ద్వారా తొలి మానవుల పరిణామ ప్రక్రియ ముందుకు సాగిందని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడయ్యింది. తొలుత మానవులు తమ పోషణ కోసం పెద్ద జంతువులపై ఆధారపడేవారు. ఈ నేపధ్యంలో అవి అంతరించిపోవడంతో చిన్న జంతువులను వేటాడేందుకు ఆయుధాలు, సాధనాలను తయారు చేయవలసి వచ్చిందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ అధ్యయనం కోసం ఇజ్రాయెల్‌ పరిశోధకులు నాటి మానవులు వేట కోసం వినియోగించిన ఆయుధాలను పరిశీలించారు. చిన్న, చురుకైన జంతువులను వేటాడాల్సి రావడం అనేది తొలి మానవుల తెలివితేటల అభివృద్ధికి సహాయపడింది. ఈ అధ్యయనంలో కీలకంగా వ్యవహరించిన టెల్ అవీవ్ విశ్వవిద్యాలయ పురావస్తు శాస్త్రవేత్త మిక్కీ బెన్-డోర్ మాట్లాడుతూ ఏనుగుల వంటి పెద్ద జంతువులను వేటాడేందుకు చెక్క ఈటెలు సరిపోతాయని అన్నారు. అయితే జింక వంటి చిన్న జంతువులు పట్టుకోవడం చాలా కష్టమని, వాటిని చేజిక్కించుకునేందుకు చెక్క ఈటెలు సరిపోవని, ఈ నేపధ్యంలో నాటి మానవులు రాతి ఆయుధాలు ఆవిష్కరించారని పరిశోధకులు కనుగొన్నారు. తొలి మానవుల్లో ఒకరైన హోమో ఎరెక్టస్ చెక్క ఈటెలను ఉపయోగించారు. నియాండర్తల్‌లు,హోమో సేపియన్‌లు సుమారు మూడు లక్షల సంవత్సరాల క్రితం రాతితో కూడిన ఆయుధాలను ఉపయోగించడం ప్రారంభించారు. 50 వేల సంవత్సరాల క్రితం హోమో సేపియన్లు విల్లు, బాణం, ఈటె లాంటి విసిరే ఆయుధాలను ఉపయోగించడం ప్రారంభించారు. అలాగే 25 వేల సంవత్సరాల క్రితం, వేట కోసం వలలతో పాటు శునకాల సహకారం తీసుకోవడం ప్రారంభమైంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..