Warangal: లంచాలకు వ్యతిరేకంగా వినూత్న నిరసన.! చర్యలు తీసుకోవడంలేదంటూ దున్నపోతులతో ర్యాలీ.

|

Dec 13, 2023 | 6:56 PM

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అవినీతి అధికారులకు కాలం గుడుస్తున్నా శిక్షలు పడకపోవడంపై.. వరంగల్‌లో అవినీతి నిరోధక స్వచ్ఛంద సంస్థ వినూత్న నిరసనకు దిగింది. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ACBకి చిక్కిన ప్రభుత్వ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై వరంగల్‌లో వినూత్న నిరసన తెలిపారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ ర్యాలీని నిర్వహించారు.

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అవినీతి అధికారులకు కాలం గుడుస్తున్నా శిక్షలు పడకపోవడంపై.. వరంగల్‌లో అవినీతి నిరోధక స్వచ్ఛంద సంస్థ వినూత్న నిరసనకు దిగింది. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ACBకి చిక్కిన ప్రభుత్వ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై వరంగల్‌లో వినూత్న నిరసన తెలిపారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ ర్యాలీని నిర్వహించారు. అవినీతి వ్యతిరేక సంస్థ జ్వాల ఆధ్వర్యంలో హనుమకొండ వేయి స్తంభాల గుడి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు దున్నపోతులతో వినూత్న నిరసన ర్యాలీ చేశారు. దున్నపోతుపై వాన కురిసిన చందంగా అవినీతి అధికారుల తీరు ఉందంటూ ఆరోపించారు. చట్టాలు పకడ్బందీగా ఉన్నా చర్యలు మాత్రం శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి నిరోధక చట్టాలు లంచగొండులపై ఎలాంటి ప్రభావం చూపించడం లేదన్నారు. అవినీతి నిరోధక శాఖను వెంటనే ప్రక్షాళన చేయాలని, లంచాలకు అలవాటుపడ్డ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జ్వాలా అవినీతి నిరోధక స్వశ్చంద సంస్థ నిర్వాకులు డిమాండ్ చేశారు .

అవినీతికి పాల్పడ్డ ఉద్యోగులపై మూడు నెలల్లో చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉండగా.. సంవత్సర కాలం గడుస్తున్నా.. లంచగొండి అధికారులకు శిక్షలు పడడం లేదని ఆరోపించారు. చట్టాలు అమలు కాకపోవడంతో అవినీతికి పాల్పడే ఉద్యోగుల్లో భయం లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని నిర్మూలించేందుకు చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరారు. వచ్చే డిసెంబర్ 9న అవినీతి నిరోధక దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.