అగ్నిపర్వతం బద్ధలు..విమానాలు క్యాన్సిల్ వీడియో
ఇండోనేషియాలో ఒక అగ్నిపర్వతం బద్దలవడంతో ఆరు కిలోమీటర్ల ఎత్తుకు బూడిద ఎగిసిపడింది. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మాస్కులు ధరించి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఫ్లోరెస్ ద్వీపంలోని లెవోటోబో లాకీ లాకీ అగ్నిపర్వతం సోమవారం ఉదయం విస్ఫోటనం చెందింది. దీంతో అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ఈ విస్ఫోటనంలో 1.2 కిలోమీటర్ల నుంచి ఆరు కిలోమీటర్ల ఎత్తుకు బూడిద దట్టమైన మేఘంగా ఎగిసిపడింది. సమీప గ్రామాలను లావా బూడిద కమ్మేయగా అక్కడి గ్రామాలు చీకటిగా మారడంతో వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇండోనేషియా వాల్కనాలజీ ఏజెన్సీ అగ్నిపర్వతం చుట్టూ ఆరు కిలోమీటర్ల పరిధిని నిషేధిత జోన్ గా ప్రకటించింది. శ్వాసకోశ సమస్యలు రాకుండా ఫేస్ మాస్కులు ధరించాలని సూచించింది. విమానాల రాకపోకలు నిలిపివేసి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ఘటనలో ప్రాణనష్టం గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. కాగా ఈ అగ్నిపర్వతం ఇండోనేషియా 130 క్రియాశీల అగ్నిపర్వతాలైన రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉండి తరచు విస్ఫోటనాలకు గురవుతుంది.