ఇండిగో ఎఫెక్ట్‌.. కొత్త జంటల తీవ్ర ఇబ్బందులు.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

Updated on: Dec 09, 2025 | 11:06 AM

ఇండిగో విమానయాన సంస్థ సిబ్బంది కొరత, సాంకేతిక లోపాలతో సంక్షోభంలో కూరుకుపోయింది. వందలాది విమానాల రద్దు, ఆలస్యం కారణంగా దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వివాహ వేడుకలకు హాజరు కావాల్సిన వారికి తీరని కష్టాలు ఎదురవుతున్నాయి, పెళ్లిళ్లు కూడా రద్దవుతున్నాయి.

దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభంలో చిక్కుకుంది. సిబ్బంది కొరతతో సతమతం అవుతున్న ఇండిగో.. తీరుతో ప్రయాణికుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ఇండిగో విమానాలు రద్దయ్యాయి.. అయితే.. కొన్ని విమానాలు మాత్రం ఆలస్యంగా నడుస్తున్నాయి.. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌, బెంగళూరు గోవా, అహ్మదాబాద్‌లో సర్వీసులు రద్దయ్యాయి.. సాంకేతికలోపం, సిబ్బంది కొరతతో విమానసేవల్లో సమస్యలు మొదలయ్యాయి.. ఈ క్రమంలో ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిలేషన్స్‌ ఎఫెక్ట్‌ పెళ్లిళ్లు, శుభకార్యాలపై కూడా పడుతోంది.. ఓచోట కొత్త జంట వాళ్ల రిసెప్షన్‌కి వాళ్లే వెళ్లలేకపోతే.. మరోచోట పెళ్లికొడుకు ఎయిర్‌పోర్ట్‌లో ఇరుక్కుపోయాడు.. ఈ వారం ఇండిగో విమానాల రద్దు కారణంగా వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు, అయితే ఈ అంతరాయం ముఖ్యంగా వధూవరులను తీవ్రంగా దెబ్బతీసింది. ఒక జంట వీడియో కాల్ ద్వారా తమ వివాహ రిసెప్షన్‌కు జరుపుకుంటే.. మరికొందరు వివాహ వేడుకలను రద్దు చేసుకోడానికి రెడీ అయ్యారు. కొందరైతే పెళ్లి వాయిదా వేయడం ఇష్టం లేక ఖరీదైన చార్టర్ ఫ్లైట్‌ను బుక్ చేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ యువకుడు తన వెడ్డింగ్‌ కార్డును చూపిస్తూ..ఎయిర్‌లైన్స్‌ సమస్య కారణంగా నా పెళ్లికి నేను హాజరుకాలేకపోతున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియోను తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ..ఇది నా స్వంత పెళ్లి.. కానీ నేను వెళ్లలేకపోతున్నాను..ఏం చేయాలి యార్‌ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఓ యూజర్‌ ..అతను త్వరగా వివాహం చేసుకోవాలని, అతని సమస్యలన్నీ శాంతియుతంగా పరిష్కారమవ్వాలని, విమానాశ్రయాలలో చిక్కుకున్న ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని ప్రార్థిస్తున్నాను అంటూ స్పందించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆడపిల్ల పుడితే రూ.10 వేలు ఎఫ్‌డీ చేస్తా… పంచాయతీ పోరులో ఓ సర్పంచ్ అభ్యర్థి హామీ

ఏంది సామీ ఇదీ.. నువ్వు నేతవా.. మాంత్రికుడివా

అడ్డంగా దొరికిన అదనపు కలెక్టర్‌.. ఏం చేశాడంటే

రోడ్డుపక్కన గుట్టలు గుట్టలుగా ఏటీఎం కార్డులు

ఈ కోతులు సల్లగుండా సర్పంచ్‌ ఎన్నికలనే మార్చేశాయిగా