ఇండిగోలో బంగారం మాయం.. పరిహారం మరీ ఇంత తక్కువా

Updated on: Feb 07, 2026 | 9:45 AM

మహ్మద్ రైస్ ఖాన్ ఇండిగో విమానంలో అబుదాబి నుంచి హైదరాబాద్ వస్తుండగా, అతని క్యాబిన్ బ్యాగ్‌లోని 35 గ్రాముల బంగారు బ్రేస్‌లెట్ చోరీకి గురైంది. వినియోగదారుల కమిషన్ ఇండిగో సేవలో లోపం ఉందని నిర్ధారించి, బాధితుడికి రూ. 60,000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే, బ్రేస్‌లెట్ అసలు విలువ లక్షల్లో ఉన్నందున, కమిషన్ ఆదేశించిన పరిహారం చాలా తక్కువని విమర్శలు వెల్లువెత్తాయి.

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం గంగన్నపేట గ్రామానికి చెందిన మహ్మద్ రైస్ ఖాన్‌ 2023 డిసెంబర్‌ 6న అబుదాబి నుంచి హైదరాబాద్‌కు ఇండిగో విమానంలో ప్రయాణించాడు. తన క్యాబిన్ బ్యాగ్‌లో 35.47 గ్రాముల బరువున్న 24 క్యారెట్ల బంగారు బ్రేస్‌లెట్‌ను తీసుకొచ్చాడు. దుబాయ్‌లో కొనుగోలు చేసిన ఆ బ్రేస్‌లెట్‌కు సంబంధించిన బిల్లు కూడా అతని వద్ద ఉంది. అయితే శంషాబాద్ చేరుకున్న తర్వాత, తన క్యాబిన్ బ్యాగ్ తాళం పగిలి ఉండటాన్ని గమనించాడు. బ్యాగ్ తెరిచి చూడగా బంగారు బ్రేస్‌లెట్ మాయమైందని తెలిసి షాకయ్యాడు. వెంటనే ఇండిగో హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించి ప్రాపర్టీ ఇర్రెగ్యులారిటీ రిపోర్ట్ నమోదు చేశాడు. అనంతరం శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో అలాగే వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్–I తీవ్రంగా స్పందించింది. ప్రయాణికుడి సామానును భద్రంగా కాపాడడంలో విఫలమైందనీ సేవలో లోపం ఉన్నట్లు తేల్చి, బాధితుడికి రూ.60 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఫిర్యాదుపై ఆలస్యంగా స్పందించిన తీరు కూడా తప్పేనని కమిషన్ స్పష్టం చేసింది. అయితే 37 గ్రాముల బ్రేస్‌లట్‌ ధర బంగారం రేటు విపరీతంగా పెరిగిన ప్రస్తుతకాలంలో ఎంత లేదన్నా మూడున్నర లక్షలపైనే ఉంటుంది. ప్రస్తుత రేటును పరిగణలోకి తీసుకోకుండా బాధితుడికి కేవలం రూ. 60 వేలు నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించటం విడ్డూరం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: రోజు రోజుకి భారీగా పడిపోతున్న బంగారం, వెండి ధరలు

సముద్రంలో 4 కి.మీ ఈది, కుటుంబాన్ని కాపాడుకున్న 13 ఏళ్ల బాలుడు

ప్రియుడిని పిలిచి ప్లాన్ చేసి.. భర్తను వాకింగ్‌కు తీసుకెళ్లింది.. కట్ చేస్తే..

పుష్కరానికోసారి పూసే అరుదైన పుష్పం.. చూడాలంటే అదృష్టం ఉండాలి

చాక్లెట్ అనుకుని తింటే.. నోట్లో పేలిన బాంబు.. చివరికి