మనసుల్ని గెలిచిన ఇండిగో పైలట్‌.. ఒక్క మాటతో

Updated on: Dec 10, 2025 | 3:25 PM

ఇండిగోలో ఏడో రోజుకు చేరిన సంక్షోభం వందలాది విమానాల రద్దుకు దారితీసింది. పైలట్ విశ్రాంతి నిబంధనల వల్ల సిబ్బంది కొరత ఏర్పడి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ కష్టకాలంలో, కెప్టెన్ ప్రదీప్ కృష్ణన్ ప్రయాణికులకు క్షమాపణ చెప్పి, గ్రౌండ్ స్టాఫ్‌తో దయగా ఉండమని కోరడం మానవత్వాన్ని చాటింది. ఆయన చొరవపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇండిగోలో సంక్షోభం ఏడో రోజుకు చేరింది. సోమవారం 150కి పైగా, ఆదివారం 650కి పైగా విమానాలను సంస్థ రద్దు చేసింది. పైలట్ విశ్రాంతికి సంబంధించిన కొత్త రూల్స్‌ కారణంగా సిబ్బంది కొరత ఏర్పడింది. వందలాది ఇండిగో విమానాలు క్యాన్సిల్ అవుతున్నాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో ఇండిగో పైలట్ చూపిన చొరవ అందరి మనసులను గెలుచుకుంది. విమానంలో ప్రయాణికులకు క్షమాపణ చెబుతూ ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఇండిగో పైలట్ కెప్టెన్ ప్రదీప్ కృష్ణన్ తాను నడుపుతున్న విమానంలో ప్రయాణికుల వద్దకు వచ్చి ఆలస్యానికి క్షమాపణలు తెలిపారు. “మీకు కలిగిన అసౌకర్యానికి మమ్మల్ని క్షమించండి. తర్వాతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తాం” అని ఆయన తమిళంలో వినమ్రంగా చెప్పారు. ఆయన నిజాయతీకి ముగ్ధులైన ప్రయాణికులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కెప్టెన్ ప్రదీప్, ఒక భావోద్వేగపూరిత క్యాప్షన్ కూడా జతచేశారు. “నన్ను క్షమించండి. విమానం ఆలస్యం కారణంగా ముఖ్యమైన పనులు కోల్పోతే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. మేమేమీ సమ్మె చేయడం లేదు. పైలట్లుగా మేం మా వంతు కృషి చేస్తున్నాం. మేం కూడా మా ఇళ్లకు వెళ్లాలనుకుంటున్నాం” అని అన్నారు. కోయంబత్తూర్‌కు వెళ్తున్న తన విమానం కూడా ఆలస్యమైందని, ప్రయాణికులు ఎంతో ఓపికగా సహకరించారని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో విమానాశ్రయాల్లోని తమ గ్రౌండ్ స్టాఫ్‌తో దయతో మెలగాలని ఆయన ప్రయాణికులను కోరారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. క్లిష్ట సమయంలో పైలట్ చూపిన మానవత్వం, వినయం అభినందనీయమని కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇదే బాగుంది గురూ.. అద్దెకు బంగారం.. లక్షలు సంపాదించండి

20 ఏళ్లుగా చీకటి గదిలోనే.. బయటకు రాగానే చూపు కోల్పోయిన యువతి

ఉద్యోగులకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. ATM నుంచి పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా

భూమ్మీదకు ఏలియన్స్‌ చూసిన వాళ్లకు కాలిన గాయాలు, మచ్చలు

సింహాల డెన్‌లోకి యువకుడు.. జరిగింది చూసి అంతా షాక్‌

Published on: Dec 10, 2025 03:15 PM