మన దేశంలో సంతోషకరమైన రాష్ట్రం ఏదో తెలుసా ??

|

Apr 24, 2023 | 9:12 PM

మన దేశంలో సంతోషంగా ఉండే ప్రాంతం ఏదీ అంటే టక్కున ఏం గుర్తొస్తుంది? అలాంటి ప్రాంతం ఒకటి ఉందా అంటే కచ్చితంగా ఇది ఆసక్తికర విషయమే. గురుగ్రామ్ మేనేజ్మెంట్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ రాజేష్ కే పిలానియా ఇదే విషయమై ఓ అధ్యయనం..

మన దేశంలో సంతోషంగా ఉండే ప్రాంతం ఏదీ అంటే టక్కున ఏం గుర్తొస్తుంది? అలాంటి ప్రాంతం ఒకటి ఉందా అంటే కచ్చితంగా ఇది ఆసక్తికర విషయమే. గురుగ్రామ్ మేనేజ్మెంట్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ రాజేష్ కే పిలానియా ఇదే విషయమై ఓ అధ్యయనం నిర్వహించారు. దేశంలో సంతోషకరమైన రాష్ట్రం మిజోరాం అని ఈ అధ్యయనంలో వెల్లడైనట్టు ఆయన ప్రకటించారు. ఆరు అంశాల ఆధారంగా మిజోరాం రాష్ట్రానికి సంతోషకమైన ట్యాగ్ లైన్ ఇచ్చినట్టు రాజేష్ కే పిలానియా తెలిపారు. కుటుంబ సంబంధాలు, పని ప్రదేశంలో పరిస్థితులు, సామాజిక అంశాలు, దాతృత్వం, మతం, సంతోషం, భౌతిక, మానసిక ఆరోగ్య అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. కేరళ తర్వాత మిజోరం నూరు శాతం అక్షరాస్యత సాధించిన రెండో రాష్ట్రం. విద్యార్థులకు అవకాశాలకు కొదవ లేని రాష్ట్రం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మానవత్వం చాటుకున్న మెట్రో సిబ్బంది.. చికిత్స చేసి ప్రాణం పోసాడు

Published on: Apr 24, 2023 09:11 PM