చైనా అమ్మాయి వెడ్స్‌ ఝార్ఖండ్‌ అబ్బాయి.. వీరి అద్భుత ప్రేమ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

Updated on: Dec 10, 2025 | 1:08 PM

సాహిబ్‌గంజ్‌కు చెందిన చందన్ సింగ్, చైనా యువతి జియావో జియావో లండన్‌లో పరిచయమై ప్రేమించుకున్నారు. జియావో భారత్‌కు వచ్చి, డిసెంబర్ 6న సాహిబ్‌గంజ్‌లో వేద మంత్రాల నడుమ భారతీయ సంప్రదాయం ప్రకారం చందన్‌ను వివాహం చేసుకుంది. ప్రేమకు దూరం, సంస్కృతి తేడాలు అడ్డు కావని నిరూపిస్తూ, ఈ వివాహం రెండు దేశాల మధ్య ఒక అందమైన వారధి అయ్యింది.

ప్రేమకు హద్దులు, సరిహద్దులు ఉండవంటారు. జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌కు చెందిన ఒక యువకుడు, చైనాలోని హెబీకి చెందిన ఒక యువతి మరోసారి దీనిని నిరూపించారు. చైనా నివాసి జియావో జియావో తన భారతీయ ప్రేమికుడు చందన్ సింగ్‌ను వివాహం చేసుకోవడానికి సొంత కుటుంబాన్ని వదిలి.. భారత్‌లో అడుగుపెట్టింది. డిసెంబరు 6న వేద మంత్రాల నడుమ, వరుడి కుటుంబ సంప్రదాయం ప్రకారం బంధుమిత్రులు, స్నేహితుల సమక్షంలో ఆ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సాహిబ్‌గంజ్‌లోని వినాయక్ హోటల్‌లో వీరి వివాహం వైభవంగా జరిగింది. చందన్ సింగ్-జియావో జియావో గతంలో లండన్‌లో ఒకే కాలేజీలో చదువుకున్నారు. అప్పట్లోనే వారి మధ్య ఏర్పడిన పరిచయం తర్వాతి రోజులలో గాఢమైన ప్రేమగా మారింది. ఆ సమయంలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే మాటను.. చందన్ తన తండ్రి.. శంభు శంకర్ సింగ్ వద్ద వ్యక్తపరచగా, ఆయన సంతోషంగా అంగీకరించారు. వివాహం భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా జరిగేలా చూసుకున్నారు. వినాయక్ హోటల్‌లో జరిగిన ఈ అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేద మంత్రాల మంత్రోచ్ఛారణల మధ్య, భారతీయ దుస్తులు ధరించిన జియావో జియావో, చందన్ సింగ్‌తో కలిసి ఏడు అడుగులు వేశారు. ఇది రెండు దేశాల సంస్కృతుల అద్భుతమైన, చిరస్మరణీయ కలయికగా మారింది. కాగా, నిజమైన ప్రేమ ముందు వేల కిలోమీటర్ల దూరం, సాంస్కృతిక భేదాలు పట్టింపు లేదని ఈ వివాహం రుజువు చేస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విచిత్ర వివాహం.. శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని పెళ్లాడిన యువతి

సర్పంచ్ బరిలో అతని ఇద్దరు భార్యలు.. చివరికి ట్విస్ట్ అదిరింది

పర్వతంపైకి తీసుకెళ్లి ప్రియురాలిని వదిలేసిన ప్రియుడు.. చలికి గడ్డ కట్టి..

రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ.. కానీ అంతలోనే ఇలా..

ప్రాణాలు తీసిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. నవ జంట దుర్మరణం