E-Bike Battery: ఈ బైక్‌ బ్యాటరీ పేలి ఎగిసిపడ్డ మంటలు.! న్యూయార్క్‌లో భారతీయుడు మృతి.

|

Feb 27, 2024 | 8:27 AM

అమెరికాలో జరిగిన అగ్ని ప్రమాదంలో భారత్‌కు చెందిన ఓ జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయాడు. న్యూయార్క్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఘటన జరిగింది. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు భారత రాయబార కార్యాలయం ప్రయత్నిస్తోంది. మీడియా కథనాల ప్రకారం.. 27 ఏళ్ల ఫాజిల్‌ ఖాన్‌ జర్నలిజంలో డిగ్రీ పూర్తిచేసేందుకు 2020లో న్యూయార్క్‌ వెళ్లాడు. అక్కడి కొలంబియా జర్నలిజం స్కూల్‌లో కోర్సును పూర్తి చేశాడు.

అమెరికాలో జరిగిన అగ్ని ప్రమాదంలో భారత్‌కు చెందిన ఓ జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయాడు. న్యూయార్క్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఘటన జరిగింది. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు భారత రాయబార కార్యాలయం ప్రయత్నిస్తోంది. మీడియా కథనాల ప్రకారం.. 27 ఏళ్ల ఫాజిల్‌ ఖాన్‌ జర్నలిజంలో డిగ్రీ పూర్తిచేసేందుకు 2020లో న్యూయార్క్‌ వెళ్లాడు. అక్కడి కొలంబియా జర్నలిజం స్కూల్‌లో కోర్సును పూర్తి చేశాడు. నాటి నుంచి అక్కడే ఉంటున్నాడు. శుక్రవారం నాడు తన అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఓ ఎలక్ట్రికల్‌ బైక్‌లోని లిథియం అయాన్‌ బ్యాటరీలో మంటలు ఎగశాయి. అవి వేగంగా వ్యాపించి భారీ అగ్ని ప్రమాదానికి దారి తీసింది. ప్రమాదంలో పాజిల్‌ ఖాన్‌ మృతి చెందాడు. కొందరు కిటికీలో నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ ఘటనలో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ ప్రమాదంపై భారత కార్యాలయం స్పందించింది. ఫాజిల్‌ మృతి పట్ల విచారం వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబం, స్నేహితులతో టచ్‌లో ఉంటున్నామని.. మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..