Viral Video: మంచుతుఫాన్‌లోనూ బాధ్యత మరవని మన ఆర్మీ.. ప్రశంసలు అందుకుంటున్న జవాన్లు..(వీడియో)
భారత ఆర్మీ జవాన్లు, కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో, జమ్మూ,కశ్మీర్ లోని ఎత్తైన ప్రాంతాలలో పహారా కాస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇండియన్ ఆర్మీ. భారత ఆర్మీ సైనికులు భారీ మంచులో ఎక్కువ ఎత్తులో
భారత ఆర్మీ జవాన్లు, కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో, జమ్మూ,కశ్మీర్ లోని ఎత్తైన ప్రాంతాలలో పహారా కాస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇండియన్ ఆర్మీ. భారత ఆర్మీ సైనికులు భారీ మంచులో ఎక్కువ ఎత్తులో ఉన్న పర్వత ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తున్నారు. పర్వతాలు, అడవుల నుండి రోడ్ల వరకు, ప్రతిదీ తెల్లటి మంచు షీట్‌తో కప్పేసి ఉంటుంది. తీవ్రమైన చలి, క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న సైనికులకు ఏమీ పట్టవు. ఇదే క్రమంలో ప్రతిరోజు భద్రతా బలగాలు మంచు దుప్పటి మధ్య దేశాన్ని రక్షించడంలో నిమగ్నమై ఉన్నాయి.