Viral Video: అర్ధరాత్రి ఒంటరైన ఫ్యామిలీకి భారత ఆర్మీ జవాన్ల సాయం.. వీడియో వైరల్

Updated on: Mar 29, 2023 | 9:45 AM

ఈ వీడియో చూసిన ప్రజల హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది. ఇద్దరు ఆర్మీ సైనికులు అర్థరాత్రి కష్టాల్లో ఉన్న కుటుంబానికి సహాయం చేసి అందరి హృదయాలను గెలుచుకున్నారు. అర్ధరాత్రి..

దేశ రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టే భారత సైనికులు.. అపదలో ఉన్నవారికి సైతం ఆసరాగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆర్మీ జవాన్ల మంచి మనసుని తెలిపే మరోక వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రజల హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది. ఇద్దరు ఆర్మీ సైనికులు అర్థరాత్రి కష్టాల్లో ఉన్న కుటుంబానికి సహాయం చేసి అందరి హృదయాలను గెలుచుకున్నారు. అర్ధరాత్రి.. ఒక కుటుంబం బైక్ చెడిపోయి రహదారిపై నిర్జన ప్రదేశంలో దిక్కుతోచనిస్థితిలో ఉండిపోయింది. తమకు ఎవరైనా సహాయం చేస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. రోడ్డుపై వెళ్తున్న వారెవరూ వీరిని పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. ఇంతలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు ఆర్మీ జవాన్లు.. వారి దగ్గరకు వచ్చి విషయం ఆరా తీశారు. బెక్ స్టార్ట్ అవడంలేదని తెలుసుకున్న జవాన్లు తమ బైక్‌ను వారికి ఇచ్చి.. మానవత్వం చాటుకున్నారు. ఆర్మీ జవాన్లకు ఆ ఫ్యామిలీ థాంక్స్ చెప్పి.. అర్ధరాత్రి సేఫ్‌గా వెళ్లిపోయారు. ఆర్మీ జవాన్లు స్పందించిన తీరు ప్రతి ఒక్కరిని కదిలించింది. ఈ హృదయాన్ని హత్తుకునే వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Heartbreak Insurance: ప్రేమలో విఫలమైన వారికి ఇన్సూరెన్స్.. 25,000 రూపాయలు బీమా.

Tourist Train: తీర్థయాత్ర చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌..బయలుదేరిన తొలి టూరిస్ట్ రైలు..

Viral Video: పెళ్లి కోసం అంత డ్రామా అవసరమా.? వధూవరుల వినూత్న ఎంట్రీ..

Published on: Mar 29, 2023 09:44 AM