డ్రోన్ ద్వారా మెడికల్ డెలివరీకి శ్రీకారం.. ట్రయిల్ టెస్ట్ స్టార్ట్… ( వీడియో )
భారతదేశం రోజురోజుకి అభివృద్ధి వైపు నడుస్తున్న క్రమంలో కొత్త వాహనాలు మార్కెట్లో అవతరిస్తున్నాయి. అంతే కాదు కొన్ని పద్ధతుల్లో కూడా కొత్త విధానాలు ప్రారంభమయ్యాయి.
భారతదేశం రోజురోజుకి అభివృద్ధి వైపు నడుస్తున్న క్రమంలో కొత్త వాహనాలు మార్కెట్లో అవతరిస్తున్నాయి. అంతే కాదు కొన్ని పద్ధతుల్లో కూడా కొత్త విధానాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే ఇటీవల మెడికల్స్ వంటి వాటిని అవసరమైన వారికి అందించడానికి, మెడికల్ డ్రోన్ ట్రయల్ ప్రారంభించబడింది. ఇది భారతదేశంలో మొట్టమొదటి మెడికల్ డ్రోన్ డెలివరీ ట్రయల్. ఈ సర్వీస్ బెంగళూరు నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌరిబిదానూర్ లో ప్రారంభమైంది. దీనిని బెంగళూరుకు చెందిన త్రాటిల్ ఏరోస్పేస్ సిస్టమ్స్ నేతృత్వంలో ఈ డ్రోన్ డెలివరీని పరీక్షిస్తోంది. ఈ పరీక్షను సివిల్ ఏవియేషన్ ఏజెన్సీ (డిజిసిఎ) మార్చి 2020 లో ఆమోదించింది. అయితే ప్రస్తుతం దేశంలో అధికంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏజెన్సీ నుండి అనుమతి పొందడంలో ఆలస్యం జరిగింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Gold And Silver Price: పతనమవుతున్న పసిడి మరియు వెండి ధరలు.. ప్రధాన నగరాలలో ధరలు ఇలా ఉన్నాయి.. ( వీడియో )
Funny Video: వధువును ఎత్తుకుని ముద్దాడిన వరుడు.. విజిల్స్‌తో స్నేహితులు సందడి.. ఫన్నీ వీడియో వైరల్