దేశంలోనే రిచెస్ట్‌ గణపతి.. ఏకంగా కోట్లలో బీమా !!

|

Sep 20, 2023 | 9:56 AM

దేశ విదేశాల్లో ఉన్న హిందువులు వినాయక చవితి వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకున్నారు. వాడవాడలా మండపాలు ఏర్పాటు చేసి వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టించి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. తాజాగా ముంబైలో GSB సేవా మండల్‌లోని మహాగణపతి విగ్రహం దేశంలోనే అత్యంత సంపన్న విగ్రహంగా ప్రసిద్ధిచెందింది. ఇక్కడ మండపంలో ఏర్పాటు చేసే వినాయక విగ్రహం అలంకరణతో ఎల్లప్పుడూ దేశంలోనే చర్చనీయాంశంగా నిలుస్తుంది.

దేశ విదేశాల్లో ఉన్న హిందువులు వినాయక చవితి వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకున్నారు. వాడవాడలా మండపాలు ఏర్పాటు చేసి వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టించి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. తాజాగా ముంబైలో GSB సేవా మండల్‌లోని మహాగణపతి విగ్రహం దేశంలోనే అత్యంత సంపన్న విగ్రహంగా ప్రసిద్ధిచెందింది. ఇక్కడ మండపంలో ఏర్పాటు చేసే వినాయక విగ్రహం అలంకరణతో ఎల్లప్పుడూ దేశంలోనే చర్చనీయాంశంగా నిలుస్తుంది. ఈ సంవత్సరం 66.5 కిలోగ్రాముల బంగారు ఆభరణాలు, 295 కిలోగ్రాముల వెండితో అలంకరించిన వినాయక విగ్రహం శోభాయమానంగా వెలిగిపోతోంది. ఈ వినాయక మండపానికి కళ్లు చెదిరే రీతిలో 360 కోట్ల రూపాయలతో బీమా చేయించారు. భద్రతాపరంగానూ ఈ మండపం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడా లేని విధంగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ కలిగిన కెమెరాలను ఏర్పాటు చేశారు. గతేడాది కూడా జీఎస్బీ సేవా మండల్ వినాయకుడికి 316 కోట్లకు బీమా చేశారు. ఈ ఏడాది 69వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అలిపిరిలో దొరికిన చిరుతలకు విముక్తి !! మరో చిరుతను విశాఖపట్నం ఇందిరా గాంధీ జూ పార్క్ కు తరలింపు

గిరిజనులను గడగడలాడిస్తున్న గజరాజులు.. అటవీ అధికారి మృతి

Birth Certificate: అక్టోబర్ 1 నుంచి బర్త్‌ సర్టిఫికేట్ కొత్త రూల్స్ !!

Indian Railways: ఇకపై భారత్ రైళ్ళలో లోయర్ బెర్త్‌లు వారికే !!

Aditya-L1: పరిశోధనలు ప్రారంభించిన ఆదిత్య ఎల్‌1 సూర్యుడి దిశగా ప్రయాణం !!