India First undersea tunnel: సముద్ర గర్భంలో ‛బుల్లెట్‌ ట్రైన్‌’ పరుగులు.. దేశంలోనే తొలిసారి.! ఎక్కడంటే..

|

Oct 01, 2022 | 8:53 PM

దేశంలోనే మొట్టమొదటి సముద్ర గర్భ సొరంగం మార్గం అందుబాటులోకి రానుంది. ఈ టన్నెల్‌ నిర్మాణం ముంబై-అహ్మదాబాద్‌ మధ్య హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌లో భాగంగా నిర్మిస్తోంది కేంద్ర ప్రభుత్వం.


దేశంలోనే మొట్టమొదటి సముద్ర గర్భ సొరంగం మార్గం అందుబాటులోకి రానుంది. ఈ టన్నెల్‌ నిర్మాణం ముంబై-అహ్మదాబాద్‌ మధ్య హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌లో భాగంగా నిర్మిస్తోంది కేంద్ర ప్రభుత్వం. సముద్ర గర్భంలో సొరంగం పనులకు బిడ్లను ఆహ్వానిస్తోంది. హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌లో భాగంగా మహారాష్ట్రలోని బంద్రా-కుర్లా కాంప్లెక్స్‌ మధ్య మొత్తం 21 కిలోమీటర్ల మేర సొరంగాన్ని నిర్మించనుండగా.. థానే జిల్లాలోని శిల్‌ఫాటా ప్రాంతంలో 7 కిలోమీటర్లు సముద్రగర్భంలో తవ్వాల్సి ఉంది. గతంలో అండర్‌వాటర్‌ టన్నెల్‌ నిర్మాణం కోసం ఢిల్లీ-ముంబై మధ్య యమునా నది కింద తవ్వాలని ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, అది సాధ్యపడలేదు. మరోవైపు.. బ్రహ్మపుత్ర నది కింద అన్ని వాహనాలు వెళ్లేందుకు వీలుగా సొరంగ మార్గం ఏర్పాటు కోసం రోడ్డు, రైల్వే మంత్రిత్వ శాఖలు ఇప్పటికే చర్యలు చేపట్టాయి. ముంబై నుంచి అహ్మదాబాద్‌ మధ్య చేపడుతోన్నఈ రైలు కారిడార్‌ మొత్తం 508.17 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. అహ్మదాబాద్‌ నుంచి ముంబై కేవలం 2గంటల 58 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రాజెక్టును పూర్తిచేసి 2026లో తొలిదశ ట్రయల్స్‌ను నిర్వహించాలని రైల్వే మంత్రిత్వ శాఖ భావిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Published on: Oct 01, 2022 08:53 PM