ఇది సంబంధాలను మరింత బలపరుస్తుంది. మనకు దక్కిన మంచి విషయాలపై కృతజ్ఞతతో ఉండటం వల్ల హృదయం ఆనందంతో నిండిపోతుంది. ఈ సానుకూల భావం శరీరంలో ఆక్సిటోసిన్ విడుదలకు దోహదం చేస్తుంది. ఇష్టమైన వాళ్ళతో కలిసి నవ్వుతూ గడిపిన ప్రతిక్షణం మనలో ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాంటి సాన్నిహిత్యంతో శరీరంలో ఆక్సిటోసిన్ హార్మోన్లు స్వభావికంగా విడుదల అవుతుంది. నవ్వు ఒక చిన్న చర్యగా కనిపించినా జీవితం మీద గొప్ప ప్రభావం చూపిస్తుంది. నిత్యం కొద్ది నిమిషాలైన ద్యానం చేయడం వల్ల మనసు శాంతిస్తుంటుంది. అంతేకాకుండా ఇది శరీరంలో ఆక్సిటోసిన్ స్థాయిని పెంచుతుంది. రోజు ఉదయం లేదా సాయంత్రం ధ్యానం చేసేందుకు కొంత సమయం కేటాయించండి. మనసు ప్రశాంతంగా ఉండేందుకు సంగీతం ఓ అద్భుతమైన మార్గం. మెలోడీ పాటలు వినడం వల్ల ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. దీనివల్ల మనసు హాయిగా మారుతుంది. శారీరక స్పర్శ ప్రత్యేకంగా హగ్ చేసుకోవడం వల్ల ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. ఇది ప్రేమ భావనను పెంపొందిస్తుంది. అలాగే మనిషి శరీరానికి హగ్ కూడా ఒక ధైర్యంగా, బలంగా ఉండే అస్త్రంగా మారుతుంది. ప్రేమను పొందాలంటే మొదటగా ప్రేమను పంచాలి. అప్పుడు ఆ హార్మోన్ సహజంగానే పెరుగుతుంది.