Groom Angry: పెళ్లి కొడుక్కి కోపం వస్తే ఇట్లుంటది మరి.. ఏంచేశాడో మీరే చూడండి..!
తాజాగా ఓ పెళ్లిలో వరుడ్ని ఆటపట్టిస్తూ అతనికి కోపం తెప్పించారు బంధువులు. ఆ సమయంలో వరుడి రియాక్షన్ చూడాల్సిందే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది.
ఈ వీడియోలో పెళ్లి వేదికపై వధూవరుల జయమాల కార్యక్రమం జరుగుతోంది. ఓ పక్క డీజే సౌండ్లు, మరో పక్క బాణాసంచా కాల్పులతో చాలా సందడిగా ఉంది వాతావరణం. ఈ క్రమంలో వరుడు.. వధువు మెడలో చక్కగా.. ఎంతో ప్రేమగా వరమాల వేశాడు. దానిని అందంగా కనిపించేటట్టు సర్ధుతున్నాడు. ఇంతలో వెనకనుంచి ఎవరో టపాసులు పేల్చారు. దాంతో దెబ్బకు జడుసుకున్నాడు వరుడు. సీన్ చూసిన వారంతా ఒక్కసారిగా నవ్వేసారు. అంతే వెంటనే వెనక్కి తిరిగి కోపంగా ఆపండ్రా బాబు.. దండలో పువ్వులు రాలిపోతున్నాయి అన్నట్టుగా వారిని మందలించాడు వరుడు. పాపం ఎంతో హ్యాపీగా ఉన్న వరుడి మూడ్ మొత్తం మారిపోయింది.. సంతోషంగా ఉండాల్సిన అతని ముఖం కోపంగా, అసహనంగా మారిపోయింది.. మరోవైపు కెమెరామెన్ పిలుపు.. వరమాల వేస్తూ ఇటు చూడమని.. అంతే అతడి ఎక్స్‌ప్రెషన్ చూడాల్సిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 3 లక్షలమందికి పైగా వీక్షిస్తూ లైక్ చేశారు. అంతేకాదు, రకరకాల ఫన్నీకామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.
Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?
Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..