అర్ధరాత్రి మందుబాబు చిందులు.. వీధికుక్కలతో కూడా..

Updated on: Dec 04, 2025 | 6:46 PM

హైదరాబాద్ పాతబస్తీలో మద్యం/గంజాయి మత్తులో కొందరు యువకులు వీధి శునకాలను భుజాలకెత్తుకుని విన్యాసాలు చేస్తూ, ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఈ బాధ్యతారాహిత్య చర్యలు మూగజీవాలపై హింసగా మారడంతో జంతుప్రేమికులు, స్థానికులు మండిపడుతున్నారు. రాత్రివేళల్లో పెరిగిన ఈ ఆగడాలను అరికట్టి, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ వ్యవస్థను కోరుతున్నారు.

తాగితే ఈ లోకాన్నే మర్చిపోతారంటారు. చుక్క గొంతు దిగగానే.. ఎంతటివారినైనా సరే డోంట్‌ కేర్‌..బస్తీమే సవాల్‌ అంటూ చిందులేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడూ వీధుల్లోనో, రోడ్లపైనో కనిపిస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్‌ పాతబస్తీలో జరిగింది. ఫుల్లుగా మద్యం సేవించి వచ్చీపోయేవాళ్లను ఇబ్బందులకు గురిచేయడమే వీధి శునకాలను భుజాలకెత్తుకుని చిందులేస్తూ వాటినీ ప్రాణసంకటంలో పడేశాడు. పాతబస్తీ ప్రాంతంలో రాత్రివేళలో ఈ విచిత్ర దృశ్యం కనబడింది. అంత రాత్రిపూట రోడ్ల మీద పడి కుక్కల్ని భుజాన ఎత్తుకొని విన్యాసాలు చేస్తున్నారు కొందరు యువకులు. గంజాయి మత్తులో ఉన్నారో.. లేక మద్యం నిషాలో ఉన్నారో తెలియదు కానీ, వాళ్లు విచక్షణ కోల్పోయి రోడ్ల మీద పడటమే కాకుండా ఎదుటివాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. భుజం మీద కుక్కలను ఉంచుకుని, వాటిని ఉక్కిరిబిక్కరి చేస్తూ వింత పోకడలను అనుసరిస్తున్నారు. ఇది చూసి కొందరు మత్తులో ఉన్నారని విమర్శిస్తుంటే.. మరోవైపు జంతు ప్రేమికులు మూగజీవాలను హింసిస్తున్నారంటూ మండిపడుతున్నారు. జంతువులను ఆడిస్తూ వాటితో ప్రేమగా మెలిగితే సరే.. అందులో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, వాటిని పావులా వాడుకుని, మత్తులో తూలుతూ రోడ్ల మీద పడి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే మాత్రం అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాత్రివేళల్లో గంజాయి కొడుతూ, మద్యం తాగుతూ విచ్చలవిడిగా రోడ్ల మీద తిరిగే వాళ్లు పాతబస్తీ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. పోలీస్ వ్యవస్థ ఇలాంటి వారిని కట్టడి చేసి, ఇంకోసారి ఇలా ప్రవర్తించకుండా, ఎదుటివాళ్లను ఇబ్బంది పెట్టకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒకప్పడు వాళ్లదే చరిత్ర.. ఇప్పుడు గత చరిత్ర

TOP 9 ET News: సమంతకు రూ.కోట్లు విలువ చేసే గిఫ్ట్ ఇచ్చిన భర్త రాజ్‌

సెలబ్రిటీ వెడ్డింగ్‌లో కనిపిస్తున్న ఎరుపు రంగు చీరలు

Samantha: సమంత పెళ్లి వెనక పెద్ద కథే ఉందిగా

Akhanda 2: బాలయ్యకు గుడ్‌ న్యూస్ ఏపీలో బెనిఫిట్ షోలకు ఆ ధరకు గ్రీన్ సిగ్నల్.. తెలంగాణలో?