ఇది ఆటోనా.. అంబులెన్సా.. అర్ధరాత్రి వేళ..

Updated on: Dec 04, 2025 | 7:07 PM

హైదరాబాద్‌ పాతబస్తీలో ఓ ఆటో అంబులెన్స్ లైట్లు, సైరన్‌లతో తిరుగుతూ ప్రజలను ఆశ్చర్యపరిచింది. అత్యవసర వాహనం అనుకొని దారి ఇచ్చిన ప్రజలు, ఆటో చూసి నోరెళ్లబెట్టారు. సోషల్‌ మీడియా పాపులారిటీ కోసం ఇలాంటి చర్యలు తీసుకోవడం పట్ల స్థానికులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

చేసే ఏ పనిని అయినా మంచికి ఉపయోగిస్తే దానికి ఒక అర్థం ఉంటుంది.. అలా కాకుండా అతి తెలివితేటలు ప్రదర్శిస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. పైగా దానికి క్రియేటివిటీని జోడించి, ఏదో గొప్ప పని చేశామని అనుకుంటే మాత్రం దానికన్నా పిచ్చితనం ఇంకోటి ఉండదు. ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావంతో ఇలాంటివి చాలానే చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవ్వాలని తోచిన విధంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌ పాతబస్తీలో రాత్రివేళ ఓ ఆటో హల్చల్ చేసింది. పాతబస్తీలో రాత్రి వేళ అంబులెన్స్‌ లైట్లతో, అంబులెన్స్‌ శబ్దం చేస్తూ ఓ ఆటో దేసుకెళ్తోంది. ఆ శబ్దాలు అంబులెన్స్‌ అనుకొని ఇతర వాహనదారులంతా ఆ ఆటోకి సైడ్‌ ఇస్తున్నారు. తీరా అది వాళ్లను దాటి ముందుకు వెళ్లిపోతుంటే, అక్కడ ఆటో వెళ్తుండడం చూసి నోరెళ్లబెడుతున్నారు. ఇదేంటి ఆటోకి అంబులెన్స్‌ సౌండ్‌ అని వింతగా చూస్తున్నారు. ఇటీవల పాతబస్తీ ప్రధాన రహదారుల్లో రాత్రిపూట ఈ ఆటో సంచరించడం కలకలం రేపింది. రాత్రివేళ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ రోడ్డు మీద వచ్చీ పోయేవారిని తెగ ఇబ్బందులకు గురి చేసింది ఈ ఆటో. దీంతో స్థానికులు, నెటిజన్లు ఆటోడ్రైవర్‌ తీరుకు మండిపడుతున్నారు. అత్యవసర పరిస్థితిలో ఉపయోగించే ఈ విధానాన్ని దుర్వినియోగం చేయడమేనని, ఇలాంటివారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అర్ధరాత్రి రోడ్డుపై షాకింగ్‌ సీన్‌.. ఇరువైపులా ఆగిపోయిన వాహనాలు

అర్ధరాత్రి మందుబాబు చిందులు.. వీధికుక్కలతో కూడా..

ఒకప్పడు వాళ్లదే చరిత్ర.. ఇప్పుడు గత చరిత్ర

TOP 9 ET News: సమంతకు రూ.కోట్లు విలువ చేసే గిఫ్ట్ ఇచ్చిన భర్త రాజ్‌

సెలబ్రిటీ వెడ్డింగ్‌లో కనిపిస్తున్న ఎరుపు రంగు చీరలు