జువెలరీ షాపే టార్గెట్‌.. అయ్యాకొడుకుల ఖతర్నాక్‌ ప్లాన్‌

Updated on: Oct 19, 2025 | 1:09 PM

హైదరాబాద్‌ డబీర్‌పూరాలో ఓ జువెలరీ షాప్‌ను చోరే చేసేందుకు సినీ ఫక్కీలో జ్యూస్‌ స్కెచ్‌ను అమలు చేశారు. అయ్యాకొడుకులు ఖతర్నాక్‌ ప్లానేశారు. మత్తు కలిపిన జ్యూస్‌ను ఇచ్చి..షాప్‌ను లూటీ చేయాలన్నది వాళ్ల ఐడియా. కుర్రాడు వెళ్లి జువెల్లరీ షాప్‌ వాళ్లకు జ్యూస్‌ ఇచ్చాడు. వాళ్లకు డౌట్‌ వచ్చింది . ఎందుకని అడిగారు కూడా. ఖురాన్‌ పఠించాను.

ఆ ఖుషీలో చిన్న ట్రీట్‌ ఇస్తున్నాన్నాడు. అభినందించి జ్యూస్‌ తాగారు. జ్యూస్ తాగిన తరువాత మగతలోకి జారుకున్నారు. ఇలానే పక్క షాప్‌ వాళ్లను కూడా మత్తుతో పడుకోపెట్టేశారు ఆ తండ్రీకొడుకులు. ఐడియా వర్కవుటయింది. కానీ జువెల్లరీ షాప్‌ను దోచుకోవాలనుకున్న వాళ్ల ఆపరేషన్‌ ఫెయిలయింది. అందుకు కారణం కొంత మంది జ్యూస్‌ తీసుకోకపోవడం. ఐతే జ్యూస్‌ తాగిన వాళ్లు మగతలోకి జారుకోవడంతో కలకలం రేగింది. హుటాహుటినా హాస్పిటల్‌కు తరలించారు. వాళ్లు మెలకువలోకి రావడానికి 15 గంటలకు పైగా టైమ్‌ పట్టింది. మ్యాటర్‌ పోలీసులకు తెలిసింది. దర్యాప్తు చేస్తే జ్యూస్‌లో మత్తు మందు కలిపిన ముచ్చట తెలిసింది. వైడ్‌ యాంగిల్‌లో విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీని తిరగేసి నిందితుల జాడ పసిగట్టారు సౌత్‌ ఈస్ట్‌ పోలీసులు. ముగ్గురి నిందితులను అరెస్ట్‌ చేశారు. జువెల్లరీ షాప్‌లో చోరీ చేసేందుకే జ్యూస్‌లో మత్తు మందు కలిపి ఇచ్చినట్టు నేరాన్ని అంగీకరించారు నిందితులు. ఓల్డ్‌ సిటీలో సంచలనం రేపిన జ్యూస్‌ కేసులో అలా మిస్టరీ వీడింది. ట్రైన్‌లోనే కాదు ఎక్కడైనా సరే అపరిచితులు ఇలా ఇచ్చే పానీయాలను, తినుబండారాలను తీసుకోవద్దు అని హెచ్చరించారు పోలీసులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తపాలా శాఖ అప్‌డేట్‌.. 24 గంటల్లోనే పార్సిల్‌ డెలివరీ

Amala: నేను కోడళ్లపై పెత్తనం చెలాయించే అత్తను కాను

కోనసీమకు విదేశీ అతిథులు 12 వేల కి.మీ దూరం నుంచి …

తండ్రికి బెదిరింపు లేఖ.. రూ.35 లక్షలు డిమాండ్‌ చేసిన కొడుకు

ఖరీదైన కాఫీ..కిలో జస్ట్ రూ.25 లక్షలే