సిలిండర్‌ తీసుకున్నారు సరే..మరి రశీదు ఏది?

Updated on: Mar 19, 2026 | 1:50 PM

యుద్ధం ఎఫెక్ట్, పశ్చిమాసియా యుద్ధ మేఘాల నేపథ్యంలో దేశంలో గ్యాస్ కొరత తీవ్రమవుతుండగా, క్షేత్రస్థాయిలో అధికారుల తీరు సరికొత్త వివాదాలకు దారితీస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా పరిధి బాబానగర్ ప్రాంతంలో ఒక హోటల్‌పై జరిగిన తనిఖీలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నిబంధనల ప్రకారం వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్ గ్యాస్‌ సిలిండర్లను వాడటం నిషేధం. దీంతో నగరంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు ఒక హోటల్‌లో నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న డొమెస్టిక్ సిలిండర్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, ఆ సిలిండర్‌ను తీసుకెళ్లే సమయంలో అధికారులు ఎటువంటి ‘సీజ్ రసీదు’ఇవ్వకపోవడంతో వివాదం మొదలైంది. గ్యాస్ కొరతతో ఇప్పటికే వ్యాపారాలు కుంటుపడుతుంటే, రసీదు ఇవ్వకుండా సిలిండర్లను దౌర్జన్యంగా ఎలా తీసుకెళ్తారని హోటల్ యజమాని అధికారులను నిలదీశారు. అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, నిబంధనల ప్రకారం రశీదు ఇవ్వాల్సిందేనని స్థానికులతో కలిసి రోడ్డుపైనే నిరసన తెలిపారు. ఈ వాగ్వాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. చట్టప్రకారం అక్రమ సిలిండర్లను స్వాధీనం చేసుకునే అధికారం అధికారులకు ఉన్నప్పటికీ, దానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన రసీదును యజమానికి అందజేయడం తప్పనిసరి. కానీ ఇక్కడ ఆ నియమాన్ని గాలికొదిలేయడమే ఈ గొడవకు ప్రధాన కారణమైంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

మరిన్ని వీడియోల కోసం :

ఫ్లయిట్‌లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్

ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే.. వైరల్ అవుతున్న వీడియో

బిగ్ అలర్ట్ : కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు

 

Published on: Mar 19, 2026 01:30 PM
Follow Us