Lady Aghori Naga Sadhu: అఘోరీ ఆత్మార్పణ కథ సుఖాంతం.! అఘోరి చర్యలపై డిమాండ్‌..

|

Nov 03, 2024 | 2:02 PM

తెలంగాణలో గత కొద్ది రోజులుగా లేడీ అఘోరీ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఆ అఘోరీ ఇప్పుడు తెలంగాణ వదిలి మహారాష్ట్రలో ప్రత్యక్షమైంది. నాగ్‌పూర్‌ హైవేపై కారులో ప్రయాణిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నిన్న అర్ధరాత్రి తెలంగాణ పోలీసులు అఘోరీని మహారాష్ట్ర సరిహద్దుల్లో వదిలిపెట్టారు.

అఘోరీ ఆత్మార్పణ కథ సుఖాంతంతో పోలీసులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మరి ఆ అఘోరీ ఎక్కడుంది..? ఆమెను ఎక్కడికి తరలించారు.? నిన్న అర్ధరాత్రి తెలంగాణ పోలీసులు అఘోరీని మహారాష్ట్ర సరిహద్దుల్లో వదిలిపెట్టారు. అంతకంటే ముందు సనాతన ధర్మం కోసం సికింద్రాబాదు ముత్యాలమ్మ ఆలయం వద్ద ఆత్మార్పణం చేస్తానని ప్రకటించిన మహిళా అఘోరీని పోలీసులు మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశ్నపల్లిలోని ఆమె స్వగృహంలో నిర్బంధించారు. ఆ తర్వాత మహారాష్ట్ర సరిహద్దు వాంకిడి మండలం లకడికోటా వరకు తీసుకెళ్లి అఘోరిని వదిలేశారు. మరోవైపు గత రెండు వారాలుగా సనాతన ధర్మంపై మాట్లాడుతున్న అఘోరీ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించిందని న్యాయవాది రాజేష్ కుమార్ అన్నారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ వద్ద ఆత్మాహుతి చేసుకుంటానని ఆమె మాట్లాడటం సనాతన ధర్మాన్ని విరుద్దమని మండిపడ్డారు. తనను తాను నియంత్రించుకోలేని ఆమె … సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుతోందని ప్రశ్నించారు. ఆమె వెనుక ఎవరున్నారనే కోణంలో విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. స్టేట్ హోమ్‌లో పెట్టి ఆమెకు కౌన్సిలింగ్ ఇవ్వాలని డీజీపీని కోరారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.