రెచ్చిపోయిన రోడ్‌సైడ్‌ రోమియోలు..

Updated on: Mar 18, 2026 | 7:52 PM

హైదరాబాద్‌లోని చంచల్‌గూడా ప్రెస్ రోడ్‌లో యువకులు అర్ధరాత్రి ప్రమాదకర బైక్ స్టంట్లతో ప్రజలకు ఆటంకం కలిగిస్తున్నారు. ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచి, సీసీటీవీల ద్వారా స్టంట్ రైడర్లను గుర్తిస్తున్నారు. నిర్లక్ష్య డ్రైవింగ్‌పై కఠిన చర్యలు, వాహనాల సీజింగ్ ఉంటాయని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై శ్రద్ధ వహించి, వారి భవిష్యత్తును కాపాడాలని పోలీసులు సూచిస్తున్నారు.

హైదరాబాద్‌ చంచల్‌గూడా ప్రెస్ రోడ్ ప్రాంతం ఇప్పుడు ప్రమాదకర బైక్ స్టంట్లకు అడ్డాగా మారుతోంది. అర్ధరాత్రి వేళ కొంతమంది యువకులు బైక్‌లపై విన్యాసాలు చేస్తూ సామాన్య ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుతున్నారు. ఈ ఉదంతంపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి, ఆ ప్రాంతంలో నిఘా పెంచారు. ముఖ్యంగా వారాంతాల్లో , ఆదివారం తెల్లవారుజామున ఈ రోడ్ సైడ్ రోమియోల హంగామా ఎక్కువగా ఉంటోంది. మితిమీరిన వేగంతో బైక్‌లు నడపడమే కాకుండా, ప్రమాదకర విన్యాసాలు చేస్తూ రోడ్డుపై వెళ్లే ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నారు. దీనివల్ల ప్రశాంతంగా ఉండాల్సిన నివాస ప్రాంతాల్లో భారీ శబ్ద కాలుష్యంతోపాటు, ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులను గమనించిన పోలీసులు చంచల్‌గూడా ప్రెస్ రోడ్ వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. స్టంట్లు చేస్తున్న యువకులను గుర్తించేందుకు సిసిటివి కెమెరాలను పరిశీలిస్తున్నారు. “నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఇతరుల భద్రతకు విఘాతం కలిగిస్తే వాహనాలను సీజ్ చేయడమే కాకుండా, కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. తమ పిల్లల కదలికలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని, ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో వారు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? అనే విషయాలను గమనించాలని పోలీసులు సూచించారు. యువత సరదా కోసం చేసే ఇటువంటి పనులు వారి ప్రాణాలకే కాకుండా, ఇతరుల కుటుంబాల్లో విషాదం నింపుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేవుడు నాకిలా రాసిపెట్టాడేమో.. పవన్ ఎమోషనల్ వీడియో..

చివరికి గట్టెలపొయ్యే గతైంది !! నాగ శౌర్య తల్లి హోటల్ పరిస్థితి ఇది

Ram Charan: ముగ్గురు రిజెక్ట్ చేస్తే కానీ.. చరణ్‌ దగ్గరకు రాలేదు

Prathyusha Case: 24ఏళ్ల తర్వాత బయటికొచ్చి.. కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ్‌ రెడ్డి

పైరసీపై సరికొత్త గూగ్లీ.. సినీ పరిశ్రమకు కొత్త భద్రత

Follow Us