ఆఫ్రికన్‌ నత్తల దండయాత్ర.. మొక్కలు, తోటల విధ్వంసం

Updated on: Nov 09, 2025 | 2:13 PM

భాగ్యనగరాన్ని నత్తలు బెంబేలెత్తిస్తున్నాయి. ఎక్కడినుంచి వచ్చాయో తెలియదు కుప్పలు తెప్పలుగా వచ్చి చేరాయి. పచ్చని చెట్లను ఒక్క ఆకు లేకుండా మేసేస్తున్నాయి. వీటి నివారణ ఎలాగో తెలియక అధికారులు తలలు పట్టకుంటున్నారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లోని న్యూబోయిన్‌పల్లిలో మిలిటరీకి చెందిన వనంలో ఆఫ్రికన్‌ నత్తలు కనిపించాయి.

మూడెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పచ్చని వనాన్ని ఆఫ్రికన్‌ నత్తలు అడ్డంగా నమిలేస్తున్నాయి. చెట్టుపై ఒక్క ఆకు కూడా ఉండనివ్వడంలేదు. ఆకులు, చిగుళ్లు, కాండం, పూత,పిందెలు ఏవీ ఉంచడంలేదు. వీటి ధాటికి పెద్ద పెద్ద వృక్షాలే మోడువారి కూలిపోతున్నాయి. ఒకటీ రెండూ కాదు.. గుంపులు గుంపులుగా నత్తలు చెట్లను మేసేస్తున్నాయి. ఎక్కడ చూసినా నత్తలే కనిపిస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వీటిని ఎలా నివారించాలో తెలియక అధికార యంత్రాంగం అయోమయంలో పడింది. ఇవి హైదరాబాద్‌ మొత్తం వ్యాపించాయంటే పార్కులు, ఇళ్లలో పెంచుకునే మొక్కలూ ఏవీ మిగలవని అంటున్నారు. ఈ ఆఫ్రికన్‌ నత్తల విషయంలో అలర్ట్‌గా ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ రకం నత్తలు కేరళలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఐదు నుంచి ఆరేళ్లు జీవిస్తాయి. ఒక్కోటి నెలకు వందల సంఖ్యలో గుడ్లను పెట్టి విపరీతంగా సంతానోత్పత్తి వృద్ధి చేస్తుంది. కొద్దినెలలక్రితం ఇవి ఏపీలోని ఉభయ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లోని రైతులకు నిద్ర లేకుండా చేశాయి. బొప్పాయి, ఆయిల్‌పామ్, మిరప తదితర పంటలను పూర్తిగా నాశనం చేయడంతో రైతులు గగ్గోలు పెట్టారు. నిపుణుల సూచనలతో ఉప్పు ద్రావణం, కాపర్‌ సల్ఫేట్, స్నెయిల్‌ కిల్లర్‌ మందులను పిచికారీ చేసి అదుపులోకి తెచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెరట్లో కలుపు మొక్కలున్నాయా ?? జాగ్రత్త !!

నెల రోజుల పాటు ఉదయాన్నే ఈ నీరు తాగండి.. ఫలితం మీరే చూడండి

వీడు మామూలోడు కాదు.. హెల్మెట్‌కు బదులుగా మూకుడు

సముద్ర తీరంలో వింత జీవులు..

Health: శీతాకాలంలో తినాల్సిన కూరగాయలు ఇవే