Husband Protest For Wife: పుట్టింటినుంచి రానన్న భార్య.. ఆ భర్త ఏం చేశాడో తెలిస్తే షాకే..!

|

Dec 02, 2022 | 10:19 PM

ఆ దంపతులకు పెళ్లయి రెండేళ్లైంది. ఒకటిన్నర ఏళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా గడిపారు. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు కానీ ఆరునెలల క్రితం పుట్టింటికి వెళ్లిన భార్య ఇక అత్తింట అడుగుపెట్టలేదు. దాంతో తన భార్యను మెట్టినింటికి


ఆ దంపతులకు పెళ్లయి రెండేళ్లైంది. ఒకటిన్నర ఏళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా గడిపారు. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు కానీ ఆరునెలల క్రితం పుట్టింటికి వెళ్లిన భార్య ఇక అత్తింట అడుగుపెట్టలేదు. దాంతో తన భార్యను మెట్టినింటికి రమ్మంటూ సదరు భర్త ఆందోళనకు దిగాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మేదినీపూర్ జిల్లాలోని పింగ్లాలోని జమానా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.మేదినీపూర్ జిల్లా కేశ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనంద్‌పూర్‌కు చెందిన పీయూష్ చక్రవర్తికి, పింగ్లా జమానానికి చెందిన అమ్మాయితో రెండేళ్ల క్రితం వివాహమైంది. బంధువు చనిపోయాడని తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయిన ఆమె మళ్లీ మెట్టినిల్లు ముఖం చూడలేదు. ఇంటికి రావాలని భర్త పలుమార్లు వేడుకున్నా ఆమె వినిపించుకోలేదు. దీంతో మరో దారిలేక ఆ భర్త అత్తమామల ఇంటి ముందు నిరసనకు దిగాడు సదరు భర్త. నా భార్యను మా ఇంటికి పంపించండి అంటూ ప్లకార్డు పట్టుకుని భైఠాయించాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడ పెద్ద ఎత్తున గూమికూడారు. పోలీసులకు కూడా సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Crime Video: రెండేళ్ల బిడ్డకు తిండి పెట్టలేక చంపేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! దర్యాప్తు లో మరిన్ని నిజాలు..

Mobile Tower: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేసారుగా.! పార్ట్‌లుగా విడదీసి ట్రక్కులో..

 

Published on: Dec 02, 2022 10:19 PM