ఇంటిని అమ్మి ప్రియుడితో పరారైన భార్య.. పాపం చివరికి భర్త..

|

Feb 11, 2025 | 3:22 PM

ఇంటిని అమ్మి భార్య ప్రియుడితో వెళ్లిపోవడంతో.. ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులో జరిగింది. బలవన్మరణానికి ముందు ఆయన తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కన్యాకుమారి జిల్లా విల్లుకురికి చెందిన బెంజమిన్‌, సునీతకు 2006లో వివాహమైంది. పిల్లలు లేరు.

బెంజమిన్‌ సౌదీ అరేబియాలో ఉంటూ భవన నిర్మాణ పనులు చేసేవారు. సునీత సొంతూరిలో ఉండేవారు. భార్య ఇష్టం మేరకు తన పూర్వీకుల ఇంటిని బెంజమిన్‌ అమ్మారు. దక్షిణ మణక్కావిళైలో భార్య పేరుతో కొత్త ఇల్లు కట్టించారు. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆయన ఫోన్‌లో ప్రశ్నించినప్పుడల్లా వారిద్దరి మధ్య గొడవ జరిగేది. కొద్ది రోజుల కిందట ఆమె ఇంట్లోంచి అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు. విషయం తెలిసిన బెంజమిన్‌ సొంతూరికి వచ్చి పలుచోట్ల గాలించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఆమె తిరువందికరైకి చెందిన సైజు అనే వ్యక్తితో ఉన్నట్లు తెలిసింది. కష్టపడి కట్టుకున్న ఇంటిని సునీత అమ్మి ఆ నగదు తీసుకుని ప్రియుడితో వెళ్లిపోయినట్లు తెలియడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన చావుకు సునీత, ఆమె ప్రియుడు సైజు, ఆమె సోదరి షీలా కారణమని పోస్టు చేశారు. అనంతరం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గాయానికి కుట్లకు బదులు ఏకంగా ఫెవిక్విక్‌ రాసి చికిత్స.. కట్ చేస్తే..

అడవి పంది అనుకుని వ్యక్తిపై కాల్పులు.. సీన్ కట్ చేస్తే

సంవత్సరానికి ఒకసారి మాత్రమే పూసే ఈ పువ్వు మీ ఇంట ఉంటే..

TOP 9 ET News: రూ.100 కోట్ల దిశగా తండేల్..సాధించిన చైతూ | విశ్వక్ సేన్ కొంపముంచిన పృథ్వీ మేక డైలాగ్

రూ.8 లక్షలతో స్పోర్ట్స్ బైక్‌.. ఇండియాలోనే తొలి కొనుగోలుదారుడిగా హీరో రికార్డ్