రైతు వెళ్లే దారిలో పులి.. తర్వాత ఏం జరిగిందంటే…?వీడియో
ఒక్కోసారి ప్రమాదం ఎటు నుంచి వస్తుందో తెలియదు. మనం ప్రమాదకరమైన ప్రదేశంలోకి వెళ్లకపోయినా ఊహించిన విధంగా ప్రమాదం మనల్ని వెతుక్కుంటూ వస్తే అదృష్టం ఉంటే తప్ప బయటపడటం అంత ఈజీ కాదు. అలాంటి సందర్భమే ఎదురైంది ఈ రైతుకి. తప్పించుకునే అవకాశం లేని విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నాడు. సరిగ్గా ఆ టైంలో జరిగిన గమ్మత్తైన తమాషా ఆ రైతుకి భూమ్మీద నూకలున్నాయనే దైర్యాన్ని ఇచ్చింది. ఒక రైతు మరో వ్యక్తితో కలిసి బైక్‌పై పొలం వైపు వెళ్తున్నాడు. ఆ గట్టు దారిలో ఒక పులి వారికి కనిపించింది. దీంతో వారిద్దరూ అప్రమత్తమయ్యారు. పులి తమ వైపు వస్తుండటాన్ని గమనించారు. అక్కడి నుంచి వెనక్కి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇది చూసిన ఆ పులి చాలా రిలాక్స్‌గా ఆ దారిపై సేదతీరింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక రైతు మరో వ్యక్తితో కలిసి బైక్‌పై పొలం మార్గంలో వెళ్తున్నాడు. కొన్ని అడుగుల దూరంలో గడ్డి పొదల్లో దాగిన పులి మెల్లగా బయటకు వచ్చింది.
ఆ ఇద్దరిని చూసి వారి వైపు కదిలింది. బైక్‌పై కూర్చున్న రైతు ప్రమాదాన్ని పసిగట్టాడు. వెనక్కి వెళ్లేందుకు బైక్‌ను తిప్పాడు. బైక్‌పై అక్కడి నుంచి వెళ్లేందుకు సిద్ధమైన వారిద్దరినీ ఆ పులి చూసింది. తనకు కూడా వారి వల్ల ఎలాంటి ప్రమాదం లేదని అది భావించింది. దీంతో ఆ ఇద్దరిని వెంబడించడాన్ని మానుకుంది. చాలా ప్రశాంతంగా పొలం గట్టు మార్గంపై కూర్చొంది. ఒక వ్యక్తి రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్‌ను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఎక్స్‌లో షేర్ చేశారు. ‘రైతు, పులి ఎదురుపడ్డారు. సహజీవనం ఇలాగే కనిపిస్తుంది. పిలిభిత్ నుంచి’ అని క్యాప్షన్ ఇచ్చారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు భిన్నంగా స్పందించారు. అదృష్టవశాత్తు ఆ వ్యక్తులకు ఏమీ జరగలేదని ఒకరు, ఆ రైతు గురించి పులికి తెలుసుంటుందని, అందుకే వారిని వెంబడించలేదని మరొకరు అన్నారు. ఆ వ్యక్తులు వెనుతిరగడంతో వారి నుంచి ప్రమాదం లేదని భావించిన ఆ పులి ప్రశాంతం అయిందని ఒకరు అభిప్రాయపడ్డారు.
మరిన్ని వీడియోల కోసం :
మహిళకు ఫ్లయింగ్ కిస్..ఎమ్మెల్యే పై కేసు
చలిమంట ఇలా కూడా కాచుకుంటారా?వీడియో
ఇంత దారుణమా?కన్న కొడుకుని కడతేర్చిన తండ్రి వీడియో
చెవులు కుట్టించబోతే చనిపోయిన బిడ్డ.. అసలేం జరిగింది? వీడియో

ఆరేళ్లుగా ఆఫీసుకు వెళ్లకపోయినా నెలనెలా జీతం.. చివరికి..

యూట్యూబ్ చూసి సొంతంగా ఆపరేషన్ ఏం జరిగిందంటే? వీడియో

పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్ మండిపాటు

ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య

అరె ! కుక్క కోసం రూ.50 కోట్లా వీడియో

గుడ్లు పెట్టే వరకేనండోయ్.. ఆ తర్వాత తల్లి పక్షి జంప్ ..

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో
