Man Cheats Wife: వీడు అసలు మనిషేనా..? మరో యువతి మోజులో పడి.. భార్యకు HIV రక్తం ఎక్కించి..

Updated on: Dec 23, 2022 | 9:02 AM

గుంటూరు జిల్లాకు చెందిన చరణ్, మమతను ఐదేళ్ళ క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఇటీవలి కాలంలో మరో యువతితో చరణ్ కి వివాహేతర సంబంధం ఏర్పడింది. అడ్డుగా ఉన్న భార్యకి ఆర్‌ఎంపి వైద్యుని సాయంతో ఎచ్ఐవి వైరస్ ఎక్కించాడు భర్త

గుంటూరు జిల్లాకు చెందిన చరణ్, మమతను ఐదేళ్ళ క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఇటీవలి కాలంలో మరో యువతితో చరణ్ కి వివాహేతర సంబంధం ఏర్పడింది. అడ్డుగా ఉన్న భార్యకి ఆర్‌ఎంపి వైద్యుని సాయంతో ఎచ్ఐవి వైరస్ ఎక్కించాడు భర్త చరణ్. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బలానికి ఇంజక్షన్ అంటూ డ్రామా ఆడి, హెచ్‌ఐవీ రక్తం అందించాడు. ఆ తర్వాత భర్త నిజస్వరూపం తెలియడంతో నిలదీసింది. అవును.. నిన్ను నేను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నా.. నన్ను మరో అమ్మాయి ట్రాప్ చేసింది.. తప్పుదు విడిపోవాల్సిందే అన్నాడు. భర్త చేసిన మోసానికి ఏం చేయాలో అర్థం కాక పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది బాధితురాలు మమత. కుటుంబసభ్యులతో కలిసి తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్‌ ముందు భర్తపై ఈ ఆరోపణలు చేస్తూ బావురుమంది బాధితురాలు. తన బిడ్డకు, తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది. భవిష్యత్‌కు దారి చూపాలని వేడుకుంది. పోలీసులు కేసు ఫైల్ చేసి.. విచారణ చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Partners Relationship: సంసారంలో స్మార్ట్‌గా చిచ్చు.. ఇలాగైతే మొదటికే మోసం..! వైవాహిక జీవితం బాగుండాలి అంటే..

Shocking Video: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా గూడె కట్టేశాయి.. చెవి స్కానింగ్‌లో బయటపడ్డ షాకింగ్ సీన్..

Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..

Published on: Dec 23, 2022 09:02 AM