రైలు కంపార్ట్‌మెంట్‌లో భయానక దృశ్యం!
రైలులో భారీ పాము ప్రత్యక్షం కావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బోగీలోని ఓ బెర్త్ కింద పాము పాకుతూ కనిపించడంతో ప్రయాణికులు పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ భారతీయ రైల్వే ప్రయాణికులకు ‘జంగిల్ సఫారీ’ అందిస్తోందంటూ వ్యంగ్యంగా విమర్శించింది. ప్రయాణికుల భద్రతపై రైల్వే శాఖ తీరును ప్రశ్నించింది.
పాము పేరు చెబితేనే ఆమడదూరం పరుగెత్తుతారు చాలామంది. అలాంటిది అది ఊహించని విధంగా తమ పక్కనే ప్రత్యక్షమైతే.. గుండెఆగినంత పనవుతుంది కదా. సరిగ్గా అలాంటి సంఘటనే ఓ రైల్లో జరిగింది. ఇటీవల పాములు ఎక్కడపడితే అక్కడ ప్రత్యక్షమవుతూ జనాలను తీవ్రభయాందోళనకు గురిచేస్తున్నాయి. కార్లు, మోటారు సైకిళ్లు అయిపోయాయి..ఇప్పుడు ఏకంగా రైల్లోకి చొరబడుతున్నాయి. ఓ రైలు కంపార్ట్‌మెంట్‌లో ఓ భారీ పాము పాకుతూ కనిపించడంతో ప్రయాణికులు తీవ్ర భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సంఘటనపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ, అటు కేంద్ర ప్రభుత్వంపైనా, ఇటు రైల్వే శాఖ మంత్రిపైనా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఇది సాధారణ రైలు ప్రయాణం కాదని, రైల్వే శాఖ ప్రయాణికులకు ఉచితంగా అందిస్తున్న ‘జంగిల్ సఫారీ’ అంటూ ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో.. రైలు బోగీలోని ఓ బెర్త్ కింద భారీ పాము కదులుతూ కనిపించింది. ఈ వీడియోకు కాంగ్రెస్ ఘాటైన వ్యాఖ్యను జోడిస్తూ—”ఇకపై భారతీయ రైల్వేలో ‘జంగిల్ సఫారీ’ థ్రిల్‌ను కూడా పొందండి. మీతో పాటు ప్రయాణిస్తున్న ఈ సర్ప రాజే మీకు ఆ థ్రిల్‌ను అందిస్తాడు. ప్రయాణికుల భద్రతకు వాళ్లే బాధ్యులు. ఎందుకంటే, ప్రయాణికుల నుంచి ఛార్జీలు పిండుకునే ‘రీల్ మినిస్టర్’కు ప్రజల ప్రాణాలంటే ఏమాత్రం లెక్కలేదు” అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు, విపక్ష నేతలు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దసరాకు ఏపీ – తెలంగాణ మధ్య ప్రత్యేక రైళ్లు..
గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. సిలిండర్ పొందాలంటే.. అది తప్పనిసరి
Pulasa Fish: బంగారంతో పోటీపడుతున్న పులస..
సర్కారు బడిలోకి ఎంట్రీ ఇచ్చిన రోబో..ఇక టీచర్ ఉద్యోగాలనూ
వైద్యం కోసం వస్తే ప్రాణాలకే ముప్పు! పెద్దాసుపత్రిలో ఏం జరుగుతోంది?