Pangolins: మనదగ్గరే రూ.లక్షలు పలుకుతున్న అలుగు ధర.. కుబేరులను చేస్తున్న అరుదైన అడవి అలుగులు..

|

Oct 01, 2022 | 8:48 PM

అడవికి రాజు సింహం... అది ఎంతటి బలమైన జీవినైనా వేటాడి తినేస్తుంది. కానీ, సింహం కూడా తినలేనంత గట్టిగా ఉండే అరుదైన వన్యప్రాణులు కూడా ఉన్నాయి. అటువంటి వాటిలో అడవి అలుగు ఒకటి.


అడవికి రాజు సింహం… అది ఎంతటి బలమైన జీవినైనా వేటాడి తినేస్తుంది. కానీ, సింహం కూడా తినలేనంత గట్టిగా ఉండే అరుదైన వన్యప్రాణులు కూడా ఉన్నాయి. అటువంటి వాటిలో అడవి అలుగు ఒకటి. అలుగు వీపుపై ఉండే పెంకులు కత్తిరించేలాగా పదునుగా ఉంటాయి. ఇవి సింహం కూడా నమలలేనంత గట్టిగా ఉంటాయి. అటువంటి అరుదైన అడవి అలుగులను పాంగోలిన్‌ అని కూడా పిలుస్తారు. చైనీస్‌ పాంగోలిన్, ఏషియా పాంగోలిన్, సుండా పాంగోలిన్, పాతమాన్‌ పాంగోలిన్‌ అని నాలుగు రకాల అలుగులు ఉంటాయి. వీటి మూతి ముంగిసను పోలి ఉంటుంది. నాలుగు కాళ్లతో ఉండే ఈ అలుగు సుమారు 20 ఏళ్లు జీవిస్తుంది. చీమలు, పురుగులను ఆహారంగా తీసుకుంటుంది. ఎక్కువ శాతం దట్టమైన అడవి, అధికంగా వర్షాలు కురిసే ప్రాంతాలతోపాటు ఎడారి ప్రాంతాల్లో ఇవి జీవించగలవు. తొలిసారిగా 1821లో ఈ జంతువుల సంచారాన్ని గుర్తించినట్లు వైల్డ్‌ లైఫ్‌ అధికారులు తెలిపారు. వీటికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. అలుగు పెంకులను చైనాలో మందుల తయారీకి ఉపయోగిస్తారని అధికారులు తెలిపారు. ఒక్కో అలుగు 20లక్షల రూపాయల వరకు ధర పలుకుతోందని చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Published on: Oct 01, 2022 08:48 PM