Dalai Lama Dog: 12 ఏళ్లు ద‌లైలామా సెక్యూరిటీలో కుక్కని.. వేలంలో ఎలా అమ్ముతారు..?

|

Feb 20, 2023 | 8:47 AM

దలైలామా సెక్యూర్టీ వ‌ద్ద 12 ఏళ్లు సేవ చేసిన లాబ్ర‌డార్ జాతికి చెందిన శునకాన్ని అమ్మేశారు. ఆర్మీలో శిక్ష‌ణ పొందిన‌ డోకోను అతి త‌క్కువ ధ‌ర‌కు వేలం వేశారు. హిమాచ‌ల్ స్థానికుడు

దలైలామా సెక్యూర్టీ వ‌ద్ద 12 ఏళ్లు సేవ చేసిన లాబ్ర‌డార్ జాతికి చెందిన శునకాన్ని అమ్మేశారు. ఆర్మీలో శిక్ష‌ణ పొందిన‌ డోకోను అతి త‌క్కువ ధ‌ర‌కు వేలం వేశారు. హిమాచ‌ల్ స్థానికుడు దాన్ని సొంతం చేసుకున్నాడు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ పోలీసులు నిర్వ‌హించిన వేలంలో ఆ శున‌కం కేవ‌లం 1550 రూపాయలకి అమ్ముడుపోయింది. ద‌లైలామా టెంపుల్ ప‌క్క‌న ఉన్న శివాల‌యంలో తాజాగా వేలం జ‌రిగింది. వేలంలో అయిదారుగురు పాల్గొన్నారు.ప్ర‌స్తుతం డోకో వ‌య‌సు 13 ఏళ్లు. హ‌మీపూర్ జిల్లాకు చెందిన అజ‌య్ ప‌ర్మార్ దాన్ని కొనుగోలు చేశాడు. నిజానికి ఇండియ‌న్ ఆర్మీ వ‌ద్ద ఉన్న లాబ్ర‌డార్ డోకోను 2010లో హిమాచ‌ల్ పోలీసులు 1.23 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేశారు. పేలుడు ప‌దార్ధాల‌ను గుర్తించ‌డంలో ఆర్మీ వ‌ద్ద ఆ శున‌కం శిక్ష‌ణ పొందింది. స్నిఫింగ్‌లో అది శిక్ష‌ణ తీసుకుంది.అయితే ఫిబ్ర‌వ‌రి ఏడో తేదీన డోకో సేవ‌లు ముగిశాయి. ఆ జాగిలం స‌ర్వీసు నుంచి రిటైర్ అయ్యింది. అయితే దానికి వినికిడి శ‌క్తి త‌గ్గిన‌ట్లు పోలీసులు వ‌ర్గాలు తెలిపాయి. కాగా.. డోకో వేలాన్ని అడ్డుకునేందుకు ఓ ఎన్జీవో ప్ర‌య‌త్నించింది. 12 ఏళ్లు ద‌లైలామా సెక్యూర్టీలో ఉన్న ఆ జాగిలాన్ని ఎలా అమ్ముతున్నార‌ని ఆ ఎన్జీవో ప్ర‌శ్నించింది.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 20, 2023 08:47 AM