Horse kicked man: నాతోనే పరాచకాలా.. తిక్క కుదిరిందా.. ఎగిరి వెనుక కాళ్లతో తన్నిన గుర్రం..(వీడియో)

Updated on: Sep 04, 2022 | 8:56 AM

గుర్రంతో పరచకాలాడిన ఓ వ్యక్తికి తగిన బుద్ధి చెప్పిందా అశ్వం. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. గుర్రం దెబ్బకు సదరు వ్యక్తి అవమానకర రీతిలో కిందపడ్డాడు.


గుర్రంతో పరచకాలాడిన ఓ వ్యక్తికి తగిన బుద్ధి చెప్పిందా అశ్వం. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. గుర్రం దెబ్బకు సదరు వ్యక్తి అవమానకర రీతిలో కిందపడ్డాడు. అయితే నెటిజన్లు మాత్రం తగిన శాస్త్రి జరిగిందటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి గుర్రాన్ని రోడ్డుపై తీసుకెళుతున్నాడు. ఈ క్రమంలో మరో వ్యక్తి ఆ గుర్రం వెనకాల నడుచుకుంటూ వచ్చి.. దాన్ని ఆటపట్టించేందుకు ప్రయత్నించాడు. తన రెండు చేతులతో గుర్రం వెనకాల కొట్టాడు. దాంతో గుర్రానికి కోపం నషాలానికి అంటింది. వెంటనే తన రెండు వెనక కాళ్లతో వ్యక్తి మొహంపై ఎగిరి తన్నింది. దబ్బకు సదరు వ్యక్తి ఎగిరి రోడ్డుపై పడ్డాడు. ఈ దృశ్యం చూసి అక్కడున్న వారంతా పగలపడి నవ్వుకున్నారు. ఈ వీడియోను ఓ యూజర్‌ ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేశారు. కేవలం 6 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో చూసి నెటిజను పగలబడి నవ్వుకుంటున్నారు. కర్మ ఫలం అందే ఇదేనేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bride Running on Road: నీ తల్లీ అంటూ మరోసారి తెలంగాణ శకుంతలను గుర్తు చేసిన మహిళా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..లేదా..!

Mother sentiment: పసితనంలో తల్లిని పోగొట్టుకొని.. ఆమె తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు చేసిన పనికి మీకు కూడా కనీళ్లు ఆగవు..

 

Published on: Sep 04, 2022 08:56 AM
Follow Us