అడవిలో కొత్త జంట హనీమూన్.. ఊహించని అతిథుల హల్‌చల్ వీడియో

Updated on: Jul 20, 2025 | 12:24 AM

తాజాగా నెట్టింట ఒక వీడియో తెగ చక్కర్లు కొడుతుంది. హనీమూన్లో భాగంగా కొన్ని జంటలు ఒక అడవికి సమీపంలో వేరువేరు టెంట్లలో పడుకుని ఉన్నారు. అయితే అర్థరాత్రి సమయంలో కొన్ని సింహాలు అక్కడికి వచ్చాయి. టెంట్లను విచిత్రంగా చూసిన రెండు సింహాలు అక్కడున్న టెంట్లను లాగి పడేసి చిందరవందర చేద్దామని ప్రయత్నించాయి. టెంట్ చుట్టూ తిరుగుతూ లోపల ఉన్న వ్యక్తుల వాసనను పసిగట్టి వారికోసం వెతికా యి.

 ఈ క్రమంలో టెంట్ లోపల ఉన్న వారికి మెలుకువ వచ్చింది. బయట సింహాలు తిరుగుతుండటం చూసి షాక్ తిన్నారు. భయాన్ని కంట్రోల్ చేసుకుంటూనే సింహాలకు అనుమానం రాకుండా సైలెంట్‌గా పడుకున్నారు. కాసేపు అక్కడే చక్కర్లు కొట్టిన జంట సింహాలు తర్వాత అక్కడినుంచి నెమ్మదిగా ముందుకు సాగిపోయాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీ కెమెరాలలో రికార్డ్ అయింది. అయితే ఇదంతా కావాలని షూట్ చేసినట్లుగా ఉందంటూ కొందరు కొట్టి పారేస్తున్నారు. ఏదే మైనా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. హనీమూన్ రాత్రి కాళరాత్రిగా మారిందే అంటూ కొందరు సింహాలను కూడా తట్టుకునేలా ఉన్న టెంట్లు అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.79 లక్షలకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది.