పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
హైదరాబాద్‌లోని హబ్సిగూడలో ఓ డాక్టర్ ఇంట్లో పనిమనిషిగా చేరిన అల్లు తేజస్వి, నమ్మకాన్ని దుర్వినియోగం చేసి రూ. 3.88 లక్షల విలువైన బంగారు నగలు దొంగిలించింది. బాధితుడు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి నగలను స్వాధీనం చేసుకున్నారు. పనివారి పూర్వాపరాలను తప్పనిసరిగా తనిఖీ చేసి, పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. నమ్మకద్రోహంపై జాగ్రత్తగా ఉండాలి.
ప్రస్తుత కాలంలో ఎవర్ని నమ్మాలో..ఎవర్ని నమ్మకూడదో తెలియని పరిస్థితి నెలకొంది. నమ్మి ఇంట్లో పని కల్పించిన యజమానులకు నమ్మక ద్రోహం చేస్తున్నారు కొందరు వ్యక్తులు. కొందరైతే యజమానుల ప్రాణాలే తీసేసిన ఘటనలు చూశాం. తాజాగా హైదరాబాద్‌లో ఓ డాక్టర్ ఓ మహిళను తన ఇంట్లో పని కోసం నియమించుకున్నారు. ఆ మహిళను డాక్టర్ కుటుంబం ఎంతో నమ్మకంగా చూసేది. అయితే వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఆ కిలాడీ లేడీ తన అసలు రూపాన్ని బయటపెట్టింది. హబ్సిగూడలో నివసించే ఓ ప్రముఖ డాక్టర్ ఇంట్లో పని మనిషిగా చేరిన మహిళ, అదును చూసి లక్షల విలువైన బంగారు నగలు కొట్టేసింది. చివరికి పోలీసుల విచారణలో దొరికిపోయి ఊచలు లెక్కపెడుతోంది. పోలీసుల వివరాల ప్రకారం, బాదంగ్‌పేట్‌కు చెందిన అల్లు తేజస్వి గత ఏడాది అక్టోబర్ నుండి హబ్సిగూడలోని ఒక డాక్టర్ ఇంట్లో పనికి కుదిరింది. అప్పటి నుండి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్యకాలంలో, ఎవరికీ అనుమానం రాకుండా అల్మారాల్లో ఉన్న బంగారు నగలను కొద్దికొద్దిగా దొంగిలించడం మొదలుపెట్టింది. ఇటీవల ఇంట్లో విలువైన ఆభరణాలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన డాక్టర్, ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, అనుమానితురాలైన తేజస్విని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకుంది. ఆమె వద్ద నుండి రూ.3.88 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పని మనుషులను పెట్టుకునేటప్పుడు వారి పూర్వాపరాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లీవ్ క్యాన్సిల్ చేసిన బాస్.. యువతి రియాక్షన్ వైరల్
TOP 9 ET: ఫ్యాన్స్ బీ అలర్ట్ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రైజ్
9 ఏళ్ల కిందట రూ.500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు కన్నీరు
బ్రిటీషర్లకు రూ.35 వేల అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా..!
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’
