పొలం పనుల్లో కూలీలు బిజీ.. అంతలోనే చిరుత
అడవుల్లో ఆహారం నీళ్లు దొరక్కపోవడంతో క్రూర మృగాలు పంట పొలాలు, జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో అవి పశువులు, మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లోని ఉనా జిల్లాలో ఓ చిరుతపులి జనాలను పరుగులు పెట్టించింది. పొలాల్లోకి ప్రవేశించి అక్కడ పనిచేస్తున్నవారిపై దాడి చేసింది.
అక్టోబరు 20న ఉనా జిల్లాలోని ఓ గ్రామంలో రైతులు, కూలీలు పొలంలో పనులు చేసుకుంటున్నారు. ఇంతలో ఓ చిరుత పొలాల్లోకి చొరబడింది. దానిని గమనించకుండా కూలీలు తమ పనిలో ఉండగా, అక్కడున్న పొలంలో నక్కిన చిరుత.. అదును చూసి దాడి చేసేందుకు రెడీ అయింది. అయితే.. ఓ కూలీ దానిని గమనించి బిగ్గరగా కేకలు వేయటంతో పొలంలోని మిగతా కూలీలు అలర్ట్ అయి.. గ్రామం దిశగా పరుగులు తీశారు. ఈ క్రమంలో చిరుత వారిపై దాడి చేయగా.. ముగ్గురు గాయపడ్డారు. ఈ లోగా వారి అరుపులు విని గ్రామస్తులు కర్రలు, రాళ్లు పట్టుకుని ఎదురొచ్చి.. చిరుతపై ఎదురుదాడికి దిగారు. దీంతో అప్రమత్తమైన చిరుత.. పొలాల్లో నుంచి తప్పించుకుని గ్రామశివారులోని ఓ ఇంట్లోకి ప్రవేశించింది. వెంటనే గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది ట్రాంక్విలైజర్ డార్ట్‌ను ఉపయోగించి, చిరుత స్పృహ కోల్పోయేలా చేశారు. ఆ తర్వాత దాన్ని బోనులో ఉంచి వన్యప్రాణుల చికిత్స కేంద్రానికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళన నెలకొంది. చిరుత దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలంగాణలో రాకాసి ఏనుగు శిలాజం.. బిర్లా సైన్స్ మ్యూజియంలో ప్రదర్శన
Cyclone Alert: తరుముకొస్తున్న తుఫాన్.. తీరం దాటేది అక్కడే
దహాడీ వేడుకల్లో.. వాతల వైద్యం ఒక్క చురుకుతో.. ఏ రోగమైనా పరార్
