Torn Shoes: చినిగిన షూస్‌కు దిమ్మతిరిగే రేటు.. లిమిటెడ్‌ ఎడిషన్‌ అంటూ బిల్డప్..!

|

May 21, 2022 | 7:10 AM

పేరున్న ఓ విదేశీ ఫ్యాషన్‌ బ్రాండ్‌ చేసిన పనికి సోషల్‌ మీడియాలో మామూలుగా ట్రోల్‌ కావడం లేదు. అందుకు కారణం.. చీలికలుగా పీస్‌ పీస్‌లుగా చినిగిన షూస్‌ను ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచడమే.


పేరున్న ఓ విదేశీ ఫ్యాషన్‌ బ్రాండ్‌ చేసిన పనికి సోషల్‌ మీడియాలో మామూలుగా ట్రోల్‌ కావడం లేదు. అందుకు కారణం.. చీలికలుగా పీస్‌ పీస్‌లుగా చినిగిన షూస్‌ను ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచడమే. లగ్జరీ బ్రాండ్‌ అమ్మకాల సంస్థ ‘బలెన్షియాగా’ తాజాగా పారిస్‌ స్నీకర్‌ కలెక్షన్‌ పేరుతో వీటిని లాంచ్‌ చేసింది. ఈ షూస్‌ ఎలా ఉన్నాయంటే.. కనీసం వేసుకోవడానికి కూడా వీల్లేనంత దరిద్రంగా ఉన్నాయి .. !ఈ షూస్‌ను వేసుకోవడానికే అమ్మకానికి పెట్టిందట కంపెనీ. పైగా అదే ఫ్యాషన్‌ అని కూడా ప్రకటించింది. వీటిలో రెండు స్టయిల్స్‌ను రిలీజ్‌ చేయగా.. వీటి మినిమమ్‌ ధర 495 డాలర్లు అంటే 38 వేల రూపాయల నుంచి గరిష్టంగా 1, 850 డాలర్లు అంటే లక్షా 44 వేల రూపాయల దాకా నిర్ణయించింది. మట్టి కొట్టుకుపోయి.. సర్వనాశనం అయిన ఈ షూస్‌ను లిమిటెడ్‌ ఎడిషన్‌ అంటూ వంద జతలను మాత్రమే రిలీజ్‌ చేసింది. వీటి అందానికి తోడు ‘‘స్నీకర్స్‌ అంటే జీవిత కాలం ధరించేవి’’ అంటూ ఓ క్యాప్షన్‌ యాడ్‌ చేసింది బలెన్షియాగా. చెత్తగా ఉన్న షూస్‌ చూశాక ట్రోలర్స్‌ ఊరుకుంటారా?.. కంపెనీని చీల్చి చెండాడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Mango tips: మామిడి పండ్లు సహజంగా పండినవా.. కెమికల్ వేసి పండించారా.. ఇలా గుర్తించండి.!

Published on: May 21, 2022 07:10 AM