చిన్న జీతంతో సంతోషంగా బతికా.. ఇప్పుడు లక్షల జీతంతో నరకం చూస్తున్నా
సొంత ఊరిలో చిన్న ఉద్యోగమైనా.. అయినవాళ్లందరితో కలిసి ఉంటే కలిగే సంతోషమే వేరు. కానీ ఆర్ధిక పరిస్థితుల వల్లనో, ఎక్కువ జీతం ఉంటే జీవింత బాగుంటుందనే ఆలోచనతోనో చాలామంది విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తుంటారు. అధిక ఆదాయం పేరు అటుంచితే.. మనశ్శాంతిని, సంతోషాన్ని కోల్పోతున్నామని అధిక జీతం కలిగిన ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లిన ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దుబాయ్‌లో మంచి జీతంతో ఉద్యోగం చేస్తున్న సీమా పురోహిత్ అనే యువతి.. బెంగళూరులో తన మొదటి ఉద్యోగంలో రూ.18 వేల జీతంతోనే ఎక్కువ సంతోషంగా ఉన్నానంటూ పంచుకున్న వీడియో ఎంతోమందిని ఆలోచింపజేస్తోంది. సీమా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో తన పాత రోజులను గుర్తుచేసుకున్నారు. బెంగళూరులో తొలి ఉద్యోగంలో నెలకు కేవలం రూ.18,000 మాత్రమే వచ్చేదని, అయినా ఆ సమయంలో తానే ప్రపంచంలో అత్యంత ధనవంతురాలిని అనే భావన కలిగేదని ఆమె చెప్పారు. ఆ జీతంతోనే పీజీ అద్దె కడుతూ, స్ట్రీట్ షాపింగ్ చేస్తూ, క్యాంటీన్ ఫుడ్ తింటూ, స్నేహితులతో సరదాగా గడుపుతూ కొంత డబ్బు కూడా ఆదా చేసుకోగలిగానని తెలిపారు. తన జీవితంలో అవే అత్యంత సంతోషకరమైన రోజులని ఆమె పేర్కొన్నారు. అటువంటి జీవితాన్ని వదులుకొని, మంచి అవకాశాల కోసం కార్పొరేట్ పరుగులో పడి దుబాయ్‌కి వచ్చానని, ఇక్కడ జీతం బాగా పెరిగినా ఆనాటి సంతోషం, సంతృప్తి ఇప్పుడు లేవని సీమా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవితం ఓ పరుగు పందెంలా మారిందని, ఇందులో గెలుపు కోసం ప్రశాంతతను కోల్పోతున్నానని పేర్కొన్నారు. సీమా మాటలు కార్పొరేట్ ఉద్యోగుల మనసులను హత్తుకున్నాయి. చాలామంది నెటిజన్లు ఇది తమ కథేనంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ఈ పరుగుపందెం మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంటే, దాని నుంచి బయటకు రండి. మిమ్మల్ని ఎవరూ ఆపరు.. అని ఒకరి, దుబాయ్ జీవితం మీ మనశ్శాంతిని దెబ్బతీస్తుంటే, తిరిగి ఇండియాకు వచ్చేయండి. ఇక్కడ కూడా మంచి ఉద్యోగం దొరుకుతుంది, సంతోషాన్ని త్యాగం చేయకండి” అని మరో యూజర్ హితవు పలికారు. మొత్తంమీద సీమా పురోహిత్ పోస్ట్, కేవలం డబ్బు, హోదా కోసం కాకుండా వర్క్-లైఫ్ బ్యాలెన్స్, మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత సంతోషానికి ప్రాధాన్యం ఇవ్వాలనే చర్చకు మరోసారి తెరలేపింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లిళ్లు ఆపేసిన మేకలు, గొర్రెలు.. కారణం ఇదే
Nepal: నెపో కిడ్ ఉద్యమం వెనుక ఆ వ్యక్తి
మా హోటల్‌కు నిప్పు పెట్టారు.. కాపాడండి ప్లీజ్.. నేపాల్ లో భారత మహిళ ఆవేదన
Robbery: రూ. 4 కోట్ల లగ్జరీ కారు చోరీ.. కనిపెట్టిన చాట్‌జీపీటీ
రోడ్డుపై చెత్త వేస్తున్న వ్యక్తి. మున్సిపల్ అధికారులు ఏం చేశారంటే