ఆకాశం అంచులు తాకిన మోనో రైలు వీడియో

Updated on: Nov 16, 2025 | 7:56 AM

భారతదేశ సరిహద్దుల్లో భౌగోళికంగా అత్యంత క్లిష్టమైనవి హిమాలయాలే. ఈ హిమగిరులు పాకిస్తాన్, టిబెట్, మయన్మార్ వంటి దేశాల్లోనూ విస్తరించి హద్దులు పంచుకుంటున్నాయి. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో, అత్యంత శీతల వాతావరణంలో ఉన్న ఈ హిమగిరులపై సరిహద్దులో గస్తీ కాయడాన్ని మించిన క్లిష్టమైన పని మరొకటి లేదు. అలాంటి ప్రాంతాల్లో ఉండే సైనికులకు అవసరమైన రేషన్, ఇతర సరంజామా సరఫరా చేయడం చాలా కష్టంగా మారుతుంది.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కొన్ని వారాల తరబడి సరఫరా లైన్లు తెగిపోతుంటాయి. యుద్ధ పరిస్థితులు తలెత్తినప్పుడు శత్రు దేశంతో పాటు ప్రతికూల వాతావరణం సైతం మరో శత్రువుగా మారుతుంది. ఈ పరిస్థితిని నివారించేందుకు భారత శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అనేక ఆవిష్కరణలు మన ముందుకు తీసుకొస్తున్నారు. Aఅందులో భాగంగా టిబెట్ సరిహద్దుల్లోని అరుణాచల్ ప్రదేశ్‌లో కమెంగ్ హిమాలయాల్లో హై ఆల్టిట్యూడ్ మోనో రైల్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. భారతదేశంలో ముంబైలో ఇలాంటి మోనో రైలు వ్యవస్థను మనం చూడవచ్చు. సాధారణ రైల్వే, మెట్రో రైల్ వ్యవస్థలకు భిన్నంగా మోనో రైల్ సింగిల్ వీల్ ట్రాక్ మీద నడుస్తుంది. అయితే పట్టణాల్లో ఉపయోగించే ఈ వ్యవస్థను భారత శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు నడకమార్గం తప్ప మరో దారే లేని ఎత్తైన హిమగిరుల్లో ఏర్పాటు చేశారు. సముద్రమట్టానికి 16,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న కమెంగ్ హిమాలయ శ్రేణుల్లో ఏర్పాటు చేసిన మోనో రైల్ సిస్టమ్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది.

మరిన్ని వీడియోల కోసం :

మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ అదేనా? వీడియో

మీ బ్యాంక్‌ ఎకౌంట్‌ భద్రమేనా? వీడియో

మోడల్‌ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో