Viral Video: అర్థరాత్రి పక్కింట్లోంచి వింత శబ్ధాలు.. చాటుగా చూసిన స్థానికులు షాక్..!

|

Apr 01, 2023 | 9:12 PM

వినోద్ అనే యువకుడికి సంబంధించిన ఇంద్ర నిలయంలో, బంధువుల ఇంట్లో తవ్వకాలు జరుపుతుండగా శబ్దాలు వచ్చాయి. అనుమానం వచ్చిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు..

రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్‌లో గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం రేపాయి. పాత మున్సిపల్ ఆఫీస్ సమీపంలో, గవర్నమెంట్ స్కూల్ పక్కన గుప్త నిధుల తవ్వకాలు జరిపిన 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినోద్ అనే యువకుడికి సంబంధించిన ఇంద్ర నిలయంలో, బంధువుల ఇంట్లో తవ్వకాలు జరుపుతుండగా శబ్దాలు వచ్చాయి. అనుమానం వచ్చిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్నారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. బుద్వేల్ ప్రాంతంలో రాజుల కాలంలో నిర్మించిన బుర్జులు ఉన్నాయి. దాంతో ఒక బుర్జు గోడకు అనుకొని ఉన్న ఇంట్లో గుప్త నిధుల తవ్వకాలు జరిపారు నిందితులు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మొత్తం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి 16 సెల్ ఫోన్లు,3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..

Published on: Apr 01, 2023 09:12 PM