Nature Beauty: ఇదో ప్రకృతి దృశ్య కావ్యం..ఎక్కడంటే..! అద్భుతం, అందమైన పొదరిళ్లను చూసి, స్థానికులు ఫిదా..(వీడియో)

|

Jan 06, 2022 | 9:42 AM

ప్రకృతి అందాలకు పెట్టింది పేరు కోనసీమ. పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు ఎటు చూసినా చాపల పరిచిన పచ్చటి వరి పొలాలు... అలాంటి అందాలకు మంచు తోడైతే ఆ అందాలను వర్ణించడం కవులకే సాధ్యం.


ప్రకృతి అందాలకు పెట్టింది పేరు కోనసీమ. పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు ఎటు చూసినా చాపల పరిచిన పచ్చటి వరి పొలాలు… అలాంటి అందాలకు మంచు తోడైతే ఆ అందాలను వర్ణించడం కవులకే సాధ్యం. మంచు కురిసే వేళలో మైమరపించే కోనసీమ అందాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. పచ్చని చెట్లపై అల్లుకున్న మంచు గూళ్ళు వర్ణించలేని అందాలు సంతరించుకున్నాయి. మంచుకురేసే వేళలో మల్లెవిరిసే అందం కోనసీమ సొంతం అంటూ నెటిజన్లు వర్ణిస్తున్నారు.ఊటీ, అరకు, లంబసింగి వంటి అంతటి అందాలు కోనసీమ సొంతం. గత కొన్ని రోజులుగా కురుస్తున్న మంచుతో కోనసీమ కొత్త అందాలు ఆరబోయిస్తుంది.అందులో భాగంగా అంబాజీపేటలో కనిపించిన సుందర దృశ్య కావ్యం ఇది. మంచు బిందువులతో అల్లుకున్న సాలి గుడ్లు అద్భుతమైన అందమైన పొదరిల్లు అల్లుకుంది. ఉదయం వాకింగ్ కు వెళ్తూ.. మంచు గూళ్ళు చూసి ఆ అందాలను చూస్తూ ఉండుపోయారు ప్రకృతి పేమికులు.

Follow us on