ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి
నాందేడ్‌లో హృదయ విదారక ఘటన: పరువు హత్యకు గురైన ప్రియుడు సాక్షమ్ మృతదేహాన్ని యువతి ఆంచల్ పెళ్లాడింది. తమ ప్రేమను అంగీకరించని కుటుంబ సభ్యులు సాక్షమ్‌ను హత్య చేయగా, అతడికి కడసారి పెళ్లి చేసుకుంది. కులాంతర వివాహం నిరాకరించడంతో జరిగిన ఈ ఘటనలో ఆంచల్ తల్లిదండ్రులు సహా ఎనిమిది మంది అరెస్ట్ అయ్యారు. న్యాయం కోసం ఆంచల్ పోరాడుతోంది.
తన కుటుంబ సభ్యుల చేతిలో హతమైన ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుంది ఓ యువతి. నుదుట సిందూరం ధరించి, చనిపోయినా అతడే తన భర్త అంటూ గుండెలవిసేలా కన్నీళ్లు పెట్టిన యువతిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. ఈ ఘటన అక్కడున్న వారందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ హృదయ విదారక ఘటన మాహారాష్ట్రలోని నాందేడ్ లో జరిగింది. నాందేడ్‌కు చెందిన సాక్షమ్, హిమేష్ స్నేహితులు. హిమేష్ సోదరి ఆంచల్, సాక్షమ్ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పంచి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. ఈ విషయం ఆంచల్ కుటుంబ సభ్యులకు తెలిసి సాక్షమ్ కులం వేరు కావడంతో వారు పెళ్లికి నిరాకరించారు. అంతేకాదు అంచల్ కుటుంబ సభ్యులు.. సాక్షమ్‌పై కక్ష పెంచుకున్నారు. అతన్ని ఎలాగైనా చంపాలని ప్లాన్ చేసారు. పక్కాగా ప్లాన్ వేసి.. నవంబర్ 27న జునా గంజ్ ప్రాంతంలో సాక్షమ్‌ను హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న అంచల్.. ప్రియుడి అంత్యక్రియలకు హాజరైంది. చనిపోయినా అతడే తన భర్త అంటూ.. ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుంది. ఈ సీన్ అక్కడున్న వారి హృదయాలను కదిలించింది. తన తండ్రి, సోదరులు చేసిన పనికి.. తాను ప్రేమించిన వ్యక్తిని కోల్పోయి ఆంచల్ శిక్ష అనుభవిస్తోంది. తన తండ్రి సోదరులను ఉరి తీయాలని డిమాండ్ చేసింది. తమ ప్రేమ శాశ్వతమని.. అతడు లేకున్నా తాను తన ప్రియుడి ఇంట్లోనే ఉంటానని చెప్పింది అంచల్. మృతుడి తల్లి కంప్లైంట్ తో ఇత్వారా పోలీస్ స్టేషన్‌లో యువతి తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు సహా ఎనిమిది మందిపై కేసు నమోదైంది. పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితులందరినీ అరెస్టు చేశారు. హత్యకు రెండు గంటల ముందు.. యువతి తల్లి యువకుడి ఇంటికి వెళ్లి అతన్ని బెదిరించినట్లు సమాచారం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇది ఆటోనా.. అంబులెన్సా.. అర్ధరాత్రి వేళ..
అర్ధరాత్రి రోడ్డుపై షాకింగ్ సీన్.. ఇరువైపులా ఆగిపోయిన వాహనాలు
అర్ధరాత్రి మందుబాబు చిందులు.. వీధికుక్కలతో కూడా..
ఒకప్పడు వాళ్లదే చరిత్ర.. ఇప్పుడు గత చరిత్ర
TOP 9 ET News: సమంతకు రూ.కోట్లు విలువ చేసే గిఫ్ట్ ఇచ్చిన భర్త రాజ్
