క్యాన్సర్ గెలిచింది.. ఇదే నా చివరి దీపావళి యువకుడి ఎమోషనల్ పోస్ట్

Updated on: Oct 19, 2025 | 11:34 AM

ఈ ప్రపంచంలో అత్యంత బాధాకరమైన విషయం మనం ఎప్పుడు చనిపోతామో ముందుగానే తెలియడమే. ఇంకో రెండు నెలల్లో మృత్యువు కబళిస్తుందని తెలిసిన వ్యక్తి మానసిక పరిస్థితి దారుణం. అలాంటి పరిస్థితిలో.. మరణం కోసం బాధగా ఎదురు చూడటం తప్ప మరో మార్గం ఉండదు. ఇంకో రెండు నెలల్లో చనిపోయే 21 ఏళ్ల ఓ యువకుడు తన మరణం గురించి రెడ్డిట్‌లో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టాడు.

ఆ పోస్ట్‌ వైరల్‌గా మారడంతో చాలా మంది అతనికి ధైర్యం చెబుతూ రిప్లై ఇచ్చారు. ఆ పోస్టులో.. 2023లో తనకు పెద్ద పేగు క్యాన్సర్ ఫోర్త్ స్టేజీలో ఉన్నట్లు తేలినట్లు చెప్పాడు. ఎన్నో కీమోథెరపీలు చేయించుకున్నాననీ అన్నీ ట్రై చేసినా కానీ, లాభం లేకుండా పోయిందనీ డాక్టర్లు కూడా చేతులెత్తేశారనీ రాసుకొచ్చాడు. ఈ ఏడాదే తన జీవితం ముగుస్తుందని చెప్పారనీ తెలిపాడు. బయట చూస్తే ఇప్పటికే దీపావళి సందడి మొదలైందనీ ఇదే తన చివరి దీపావళి అని తల్చుకుంటే బాధగా ఉందనీ వాపోయాడు. ఇకపై.. తను దీపాలను, నవ్వుల్ని, శబ్ధాన్ని మిస్ అవుతాననీ పోస్ట్‌లో తెలిపాడు. రేపు తన స్థానంలో వేరే వాళ్లు దీపాలు వెలిగిస్తారనీ తను కేవలం ఓ జ్ణాపకంగా మిగిలిపోతాననీ అన్నాడు. అలవాటులో పొరపాటుగా ఇప్పటికీ తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటాననీ, కలలు కంటూ ఉంటాననీ తెలిపాడు. ఊర్లు తిరగాలి. సొంతంగా ఏదైనా చేయాలి ఓ కుక్కను దత్తత తీసుకోవాలి ఇలా అన్నిటి గురించి ఆలోచిస్తున్నపుడు తనకు అంత సమయం లేదని గుర్తుకు వచ్చి బాధేస్తుందనీ రాసుకొచ్చాడు. తన తల్లిదండ్రుల పరిస్థితి కూడా అలాగే ఉందనీ ఇదంతా తను ఎందుకు చెబుతున్నానో అర్థం కావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పోస్టు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టోల్ గేట్లు.. ఇక కనుమరుగు రోడ్లపై కెమెరాలతో టోల్‌ వసూళ్లు

గాల్లో వేలాడుతూ ప్రీ వెడ్డింగ్ షూట్.. ఇదేం క్రియేటివిటీ..

ఆఫీస్‌కి వెళ్లిన ఉద్యోగులకు షాక్.. దీపావళి బహుమతులు ఏంటంటే..

అమెరికా గ్రీన్ కార్డు .. 2028 వరకు భారతీయులకు ఛాన్సే లేదు

రూ.3 కోట్ల బెంజ్ కారు కొన్న రైతు.. ధోతీ కట్టుకొని వచ్చి ..