Viral Video: కోడలి కోసం ఓ అత్త సాహసం.. మనసును కదిలిస్తుంది..! వీడియో..

|

Aug 14, 2023 | 8:48 AM

అత్తా కోడళ్ల మధ్య సంబంధం అనగానే మన సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఓ ఇంప్రెషన్ ఏర్పడింది. ఏ ఇంటి తలుపు తట్టినా అత్తా కోడళ్ళ మధ్య గొడవలు సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి. అలాగే కోడలిని కూతురిలా చూసుకునే అత్తలూ అడపాదడపా కనిపిస్తుంటారు. తాజాగా మహారాష్ట్రలో కోడలి కోసం ఓ అత్త ఏకంగా తన ప్రాణాలనే పణంగా పెట్టింది. తన కోడలి కోసం ఏ అత్తా చేయలేని త్యాగం చేసి తన మాతృత్వాన్ని నిరూపించుకుంది.

అత్తా కోడళ్ల మధ్య సంబంధం అనగానే మన సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఓ ఇంప్రెషన్ ఏర్పడింది. ఏ ఇంటి తలుపు తట్టినా అత్తా కోడళ్ళ మధ్య గొడవలు సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి. అలాగే కోడలిని కూతురిలా చూసుకునే అత్తలూ అడపాదడపా కనిపిస్తుంటారు. తాజాగా మహారాష్ట్రలో కోడలి కోసం ఓ అత్త ఏకంగా తన ప్రాణాలనే పణంగా పెట్టింది. తన కోడలి కోసం ఏ అత్తా చేయలేని త్యాగం చేసి తన మాతృత్వాన్ని నిరూపించుకుంది. అత్త మంచిమనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన 70 ఏళ్ల ప్రభా కాంతిలాల్ మోటాకు ఓ కొడుకు ఉన్నాడు. అతనికి చాలా ఏళ్లక్రితమే అమిషా మోటా అనే మహిళతో పెళ్లైంది. తాజాగా 43 ఏళ్ల అమిషాకు హఠాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమెను హాస్పిటల్‎కు తరలించగా కిడ్నీపాడైందని, వెంటనే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాలని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో అమిషా భర్త జితేష్ కిడ్నీ డొనేట్ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే అతనికి షుగర్ వ్యాధి ఉండటంతో వైద్యులు నిరాకరించారు. ఈ విషయం తెలిసుకున్న ప్రభా కాంతిలాల్ తన కోడలికి తన కిడ్నీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆమె వయసు 70 ఏళ్లు కావడంతో ముందుగా కుటుంబ సభ్యులు వద్దన్నారు. వైద్యులు సైతం ఆలోచించుకోవాలన్నారు. అయినా అవేమి పట్టించుకోకుండా ఆమె కిడ్నీని కోడలికి ఇస్తానని తేల్చి చెప్పింది. నా కోడలు తనకు కూతురు లాంటిదని, తన బిడ్డ ఆరోగ్యం కన్నా తనకు ఏది ముఖ్యం కాదని ఆమె చెప్పడం అందరి అందరి హృదయాలను కదిలించింది. చలించిపోయాయి. తన కోడలి కోసం అత్త కిడ్నీ త్యాగం చేసింది. కిడ్నీ ఇచ్చిన తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అత్తకు ఆమె కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. అత్తంటే ఇలా ఉండాలంటూ నెజిన్స్ ఆమెకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...