Snake bite: ఇది తెలుసా మీకు..? పాము కాటుకు నాటు కోడితో వైద్యం.! ఎలా అంటే..

|

May 24, 2022 | 6:40 PM

పాము కాటుకు నాటు కోడితో వైద్యం.. అవును మీరు విన్నది నిజమే. ఖమ్మం జిల్లాలో జరుగుతున్న గ్రామీణ నాటు వైద్యం ఎంతో ఫేమస్‌. పాము కాటు వేసిన వాళ్లకు నాటు కోడితే చేసే వైద్యం తీసుకున్న వారందరూ బతికి బట్టకట్టారు.


పాము కాటుకు నాటు కోడితో వైద్యం.. అవును మీరు విన్నది నిజమే. ఖమ్మం జిల్లాలో జరుగుతున్న గ్రామీణ నాటు వైద్యం ఎంతో ఫేమస్‌. పాము కాటు వేసిన వాళ్లకు నాటు కోడితే చేసే వైద్యం తీసుకున్న వారందరూ బతికి బట్టకట్టారు. బ్రాహ్మణ పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పాము కాటుకు వినూత్న రీతిలో తక్కువ ఖర్చుతో పాము కాటు వేసిన చోట ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడే మార్గాన్ని కనుగొన్నాడు.ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో బ్రాహ్మణపల్లి అనే ఓ చిన్న పల్లెటూరు ఉంది. ఈ గ్రామంలో అచ్చయ్య అనే నాటు వైద్యుడు పాముకాటుకి నాటుకోడి వైద్యం చేసి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాడు. గత 30 సంవత్సరాలుగా పాము కాటుకి నాటు కోడితో వైద్యం చేస్తున్నారు. వైద్యం వికటించి ఇంతవరకు ఎవరూ చనిపోలేదు. దీంతో ఆ ఊరి ప్రజలే కాక చుట్టుపక్కల గ్రామాల వారు కూడా నాటుకోడి వైద్యుడి దగ్గరకు వెళ్తున్నారు. పాము కరిచిన వ్యక్తికి ముందుగా గాయాన్ని గుర్తించి అక్కడ నాటు కోడి మలవిసర్జన ద్వారాన్ని అదిమి ఉంచుతారు. దీంతో మలద్వారం నుండి విషాన్ని పీల్చుకొని కోడి చనిపోతుంది. అలా ఆ విషం పూర్తిగా తొలగిపోయే వరకు గాయం వద్ద వరుసగా నాటు కోళ్లు పెడుతూనేవుంటారు. ఎప్పుడైతే కోడి పూర్తిగా చలనం లేకుండా పడిపోతుందో అప్పుడు పూర్తిగా విషం తొలగి పోయినట్లు లెక్క.ఇలా పాము కరిచిన వ్యక్తికి 10నుంచి 30 కోళ్లువరకు చనిపోతూ ఉంటాయి. పాము కరిచిన వ్యక్తి ఆ రోజు ఎటువంటి ఆహారం తీసుకోకుండా రాత్రి పూట నిద్ర పోకుండా మెలకువగా ఉండాలి అంటా. అలా మరుసటిరోజు మధ్యాహ్నం భోజనం చేయాలి.. ఇది అచ్చయ్య నిబంధన. అయితే కొన్ని సందర్భాల్లో ముక్కులో జిల్లేడు లేదా ఆకు పసరు ముక్కులో వేస్తారు. దీంతో తుమ్ములు వచ్చి శరీరంలో రక్త ప్రసరణ జరిగి తొందరగా తగ్గుతుందని చెబుతున్నాడు అచ్చయ్య.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Published on: May 24, 2022 06:40 PM