NRI Marriages: అమెరికా పెళ్లి సంబంధాలపై తగ్గుతున్న మోజు

Updated on: Oct 11, 2025 | 3:10 PM

అమెరికా సంబంధం అంటే అమ్మాయిలు, వారి కుటుంబాలు ఎగరిగంతేసేవారు. అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడని బ్రోకర్లు చెబితే కళ్లకు అద్దుకుని పెళ్లిళ్లు జరిపించేవారు. కానీ, ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అమెరికా సంబంధమా? అయితే ఆలోచిస్తామండి అంటున్నారు. దీనికి కారణం అమెరికా అమలు చేస్తోన్న వీసా నిబంధనలే.

ఏదైనా కారణాలతో అబ్బాయి వీసా రద్దయితే తమ పిల్ల పరిస్థితి ఏంటి? అమ్మో అలాంటి పరిస్థితి తమకొద్దు అంటున్నారు. ఒకప్పుడు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ‘అబ్బాయి అమెరికాలో ఉంటాడు’ అన్న ఒక్క మాట చాలు. ఇంకేం మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. అమెరికా అంటేనే అపారమైన అవకాశాలు, స్థిరమైన జీవితం అనే ఒక అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారింది. ట్రంప్ 2.0 నిబంధనలు, ఐటీ కంపెనీల్లో లేఆఫ్స్, H1B వీసా ఫీజు పెంపులు , F1 వీసా డ్యూ డేట్‌లు అన్నీ మారిపోయాయి… ఒకప్పుడు ఎన్ఆర్ఐ పెళ్లి కొడుక్కు ఉన్న క్రేజ్ ఇప్పుడు సడెన్‌గా తగ్గిపోయింది! హర్యానాకు చెందిన 19 ఏళ్ల మెడికల్ స్టూడెంట్ సిద్ధి శర్మ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘అమెరికాలో స్థిరపడాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నాను. కానీ ట్రంప్ ఆ డోర్ మూసేశారు,” అందామె. ఈ ఒక్క మాట చాలు… పరిస్థితి ఎంత మారిందో అర్థం చేసుకోవడానికి. NRI ట్యాగ్ ఇప్పుడు ఆకర్షణీయంగా కనిపించడం లేదు. ఈ భయాలన్నిటికీ మూలం అమెరికా హెచ్-1బీ వీసా. భారతీయులు ఈ వీసాలను అత్యధికంగా 71% వరకు పొందేవారు. అయితే, ఈ వీసా రావడమే ఇప్పుడు గగనమైంది. పైగా సవాలక్ష నిబంధనలు. ‘రేపు ఈ అబ్బాయి వీసా ఉంటుందా? ఉద్యోగం పోతుందా? లేదంటే దేశం నుంచి తరిమేస్తారా?’ అనే భయం భారతీయ కుటుంబాల్లో మొదలైంది. ఒకప్పుడు లక్షల్లో సంపాదించే అబ్బాయికి ఆ వీసా రద్దయితే, ఇక్కడి నుంచి వెళ్లే అమ్మాయి ఆర్థిక భద్రతకు ఏమిటి గ్యారెంటీ? ఇది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందంటే… కేవలం వీసా స్టేటస్ గురించి గందరగోళం కారణంగా కొన్ని కుటుంబాలు పెళ్లిళ్లను కూడా వాయిదా వేసుకుంటున్నాయి. అట్లాంటాలో ఉంటున్న ఒక 26 ఏళ్ల భారతీయ యువకుడు ఏం చెప్పాడో తెలుసా? కేవలం ఇమ్మిగ్రేషన్ సమస్యల కారణంగానే మూడు పెళ్లిళ్లు వాయిదా పడటం తాను చూశానని చెబుతున్నారు. ఇది పెద్ద సమస్యగా మారిందనడానికి ఇదే నిదర్శనం. ఈ మొత్తం పరిస్థితిలో భారతీయ కుటుంబాలు ఏం కోరుకుంటున్నాయి? సింపుల్! భద్రత, స్థిరత్వం. హెచ్-1బీ వీసాపై అనిశ్చితి, అబ్బాయి ఉద్యోగం పోతే భవిష్యత్తు ఏమవుతుందో అనే భయం కారణంగా… ఇప్పుడు ఇండియాలోనే స్థిరంగా, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి లేదా ఇక్కడే సొంత వ్యాపారాలు చేసుకునే వారికి డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు అంతకుముందు లేని డిమాండ్… ఇప్పుడు భారత్‌లోని పర్మినెంట్ సెటిల్మెంట్ ఉన్న అబ్బాయిలకు వస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ రెండు దగ్గు సిరప్‌లు బ్యాన్‌రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గుమందు వాడొద్దు

Rukmini Vasanth: కాంతార… కాంత రుక్మిణి చరిత్ర తెలుసా ??

శ్రీవారి క్యాలెండర్లు రెడీ.. ఈసారి ఆన్‌లైన్‌లోనూ డెలివరీ

లేటుగా వచ్చారా.. రంగు డబ్బా కొనుక్కురండి విద్యార్ధులకు ప్రిన్సిపాల్ వింత పనిష్మెంట్‌

ఫోన్‌పే కొత్త ఆవిష్కరణ ‘స్మార్ట్ పాడ్‌’తో చెల్లింపులు మరింత ఈజీ!